భూమిమీద నివసించేవాటిలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుతపులి. ఇది గంటకు 100- 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు! వేగంగా పరుగు తీయాల్సి వచ్చినప్పుడు చిరుతలు తమ శ్వాసనాళాలను వెడల్పు చేసుకుంటాయి. తద్వారా ఎక్కువ ఆక్సిజన్‌ని పీల్చుకునేందుకు ప్రయత్నిస్తాయి. వేగంగా పరుగెత్తేందుకు ఆ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది వాటికి!వేగంగా పరుగెత్తుతున్నప్పుడు చిరుతలు నిమిషానికి 150 సార్లు శ్వాసను తీసుకుంటాయి. మామూలప్పటి కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ!
చిరుతల కళ్ల నుంచి నోటివరకూ ఇరువైపులా నల్లని చారలు ఉంటాయి. వీటిని టియర్‌లైన్స్ అంటారు. ఇవి అతి వేడిమి నుంచి చిరుతల కళ్లను కాపాడతాయని, ఎక్కువ దూరం వరకూ చూసేందుకు తోడ్పడతాయని పరిశోధనల్లో తేలింది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా వీటికి స్పష్టంగా కనిపిస్తాయి.
పులులు, సింహాల మాదిరిగా ఇవి గాండ్రించలేవు! వీటికి పెద్దగా దాహం వేయదు. అందుకే రెండు మూడు రోజులకు ఒక్కసారే నీళ్లు తాగుతుంటాయి! ఇవి జంతువు కనిపించగానే దానికి వీలైనంత దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా లంఘించి మీద పడి, మెడ దగ్గర ఉండే ముఖ్యమైన నాళాన్ని తెంపేస్తాయి. ఒకవేళ ఆ జంతువు వీటిని గుర్తించి, తప్పించుకుంటే చాలా వేగంగా పరుగెత్తి వాటిని వెంటాడి, వేటాడతాయి. వీటి పిల్లలు ఆరు నెలల వయసు వచ్చేవరకూ చాలా బలహీనంగా ఉంటాయి. అతి వేడిమికి తట్టుకోలేక కూడా ఒక్కోసారి చనిపోతుంటాయి!
చిరుత పిల్లలు మూడు నాలుగు నెలలు గడిస్తే గానీ మాంసాన్ని తినలేవు. ఈలోపు తల్లి పాలు తాగుతాయి! ఏడాదిన్నర వయసు వచ్చేవరకూ తల్లి వెంటే తిరుగుతాయి. ఈ వ్యవధిలో తల్లి వాటికి వేటాడటం, శత్రువులను ఎదుర్కోవడం నేర్పుతుంది. అది కూడా ఎంత తెలివిగానంటే... ఓ జంతువుని చంపి తెచ్చి పిల్లల ముందు పడేస్తుంది. ఆ కళేబరాన్ని ఉపయోగించి వేటను నేర్పుతుంది! చిరుతలకు రాత్రిపూట కళ్లు సరిగ్గా కనిపించవు. అందుకే పగటిపూట మాత్రమే వేటకు వెళ్తాయి! ఇవి కేవలం మాంసాన్ని మాత్రమే తింటాయి తప్ప సదరు జంతువు చర్మాన్ని కానీ, ఎముకల్ని కానీ తినవు!

No comments:
Post a Comment