* ఉష్ట్రపక్షిగా పిలిచే ఆస్ట్రిచ్‌ల్లో మూడు జాతులున్నాయి.
* ఆఫ్రికాలో ఉండే ఇవి పక్షుల్లోనే అతి పెద్దవి. సుమారు 9 అడుగుల ఎత్తు, 130 కిలోల బరువు పెరుగుతాయి!
* వీటి సంఖ్య సుమారు 20 లక్షలని అంచనా!
* ఇవి ఎగరలేకపోయినా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు!
* వీటి కాళ్లు చాలా దృఢమైనవి. ఒక్క తన్నుతో సింహాలను, పులుల్ని కూడా చంపగలవు!
* 24 కోడిగుడ్లు కలిపితే ఎంతుంటుందో ఆస్ట్రిచ్ గుడ్డు అంత పెద్దగా ఉంటుంది. అది నీళ్లలో ఉడకడానికి 2 గంటలు పడుతుంది!
* ఇవి అసలు నీళ్లే తాగవు!
* అన్ని గుడ్లనూ కలిపేసినా వాటిలో తాము పెట్టినవేంటో గుర్తించగలవు!
సాధారణంగా జంతువులు, పక్షులు వెనక్కి తన్నుతాయి. కానీ ఆస్ట్రిచ్‌లు మనుషుల మాదిరి కాళ్లతో ముందుకు తన్నుతాయి. పొరపాటున శత్రువు ఎదురుగా వచ్చిందో... దాన్ని తన్నుకు పడి చావాల్సిందే!
ఇవి ఆహారాన్ని నమలలేవు. అమాంతం మింగేస్తాయి. ఆ తరువాత చిన్న చిన్న గులకరాళ్లను మింగి, అటూ ఇటూ వడివడిగా తిరుగుతాయి. అప్పుడా రాళ్ల మధ్య ఆహారం నలిగి జీర్ణమవుతుందన్నమాట!
ఆస్ట్రిచ్‌లు ఎంత బలంగా ఉంటాయంటే... సింహాలతో సైతం తలపడగలవు. మనిషిని సైతం చంపగలవు. కానీ వీటి తల చాలా బలహీనంగా ఉంటుంది. కాస్త గట్టి దెబ్బ తగిలినా చాలు... ప్రాణాలను కోల్పోతాయివి!
ఆస్ట్రిచ్‌లు నీళ్లు తాగకుండా చాలాకాలం ఉండగలుగుతాయి. ఎందుకంటే తనంతట తానుగా తేమను సృష్టించుకునే లక్షణం వీటి శరీరానికి ఉంది. అందుకే నీళ్లు కనిపిస్తే ఇవి వాటిని తాగవు. ముందు నీటిలోకి దిగి తనివి తీరా స్నానం చేస్తాయి. తర్వాతే తాగుతాయి!
వీటికి ఎరుపు రంగు అంటే అస్సలు నచ్చదు. ముఖ్యంగా మగ ఆస్ట్రిచ్‌లు ఎరుపును చూస్తే కోపంతో రెచ్చిపోతాయి!
ఆడ ఆస్ట్రిచ్‌లు మహా తెలివైనవి. తాము పెట్టిన గుడ్లు... కొన్ని వందల గుడ్లలో కలిసిపోయినా కూడా అవి గుర్తించేస్తాయి!
ఆస్ట్రిచ్ గుడ్డు ఎంత ఉంటుందో తెలుసా? దీని ఒక్క గుడ్డు, రెండు డజన్ల కోడిగుడ్లతో సమానం!
ఏడెనిమిది ఆస్ట్రిచ్‌లు గుంపుగా ఏర్పడతాయి. వీటిలో ఒకటి తప్ప అన్నీ ఆడ పక్షులే ఉంటాయి. మగది లీడర్‌గా ఉంటుంది. ఇది ఆ గుంపులోని ఒక ఆడపక్షిని ఎంచుకుని జతకడుతుంది. అది లీడర్‌గారి భార్య అన్నమాట!
No comments:
Post a Comment