Tuesday, 29 September 2015






















బ్రౌన్ క్రీపర్ ( Brown Creeper )


గుల్ ( Black Headed Gull )


గూడ కొంగ ( Brown Pelican)


పెద్ద ముక్కు హమ్మింగ్ బర్డ్ (Broad billed Humming bird)


సికాడి ( Black capped chickadee)


నారాయణ పక్షి ( Black Crowned Night Heron)


కార్మోరాంట్ (cormorant)


నీలిపాదం బూబీ (Booby Bird)


Thursday, 24 September 2015

అదిగో అల్లదిగో...అతి పెద్ద పక్షి!

అదిగో అల్లదిగో...అతి పెద్ద పక్షి!


సౌత్  కరోలినా (అమెరికా)లోని చెర్లెస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో కనుగొన్న ఒక శిలాజానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇటీవల తెలిసాయి. ఆ శిలాజం అతి పెద్ద పక్షిదని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ నిర్వహించిన కంప్యూటర్ విశ్లేషణ చెబుతోంది. ఇప్పుడు ఉనికిలో ఉన్న పెద్ద పక్షులతో పోల్చితే వీటి ఆకారం రెండు, మూడింతలు పెద్దగా ఉండేది. పెలగొర్నిస్ సాండెర్సీ గా నామకరణం చేసిన ఈ భారీ పక్షి బరువు 40 కిలోల పైగా ఉండేది. వాటి వేగం ఒలింపిక్ స్ప్రింటర్  లను తలదన్నేలా ఉండేది. భారీ శరీరం అయినప్పటికీ ఆహార అన్వేషణలో భాగంగా ఈ పక్షులు సుదూర ప్రాంతాలు ప్రయాణించేవి. సముద్రాలను దాటేవి. సంవత్సరం మొత్తంలో ఈ పక్షులు భూమి మీద కంటే ఆకాశంలోనే ఎక్కువగా ఉండేవి. 
వేటగాళ్ల బారిన పడకుండా ఉండడానికి దీవులు, మారుమూల ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకునేవి. ఈ పరిశోధనలో పాలు పంచుకున్న చార్లెస్టన్ మ్యూజియం రిటైర్డ్ క్యూరేటర్ ఆల్బర్ట్ సాండర్స్ పేరు మీద ఈ పక్షులకు  సాండెర్సీ  అని నామకరణం చేశారు. సాండెర్సీ  25 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని ఒక అంచనా. శిలాజం బయటపడిన చెర్లెస్టన్ ప్రాంతం ఇప్పుడు అందమైన నగరం అయినప్పటికీ ఒకప్పుడు అది పూర్తిగా నీటితో నిండి ఉండేది.అద్భుతమైన పక్షి అని సాండెర్సీ గురించి చెబుతున్నాడు పరిశోధకుడు డేనియల్ సేప్క. ఈయన గ్రీన్ విచ్ లోని సైన్స్ మ్యూజియంలో క్యూరేటర్ గా పనిచేస్తున్నాడు.
ఈ పక్షి పై రెక్కకు సంబంధించిన ఎముక ఒక్కటే నా చేయికంటే పొడుగ్గా ఉంది ఆశ్చర్యంగా చెబుతున్నాడు సేప్క.ఈ పక్షులు అంటార్కిటికాతో సహా ప్రతి ఖండంలోనూ సంచరించేవట. కాల్పనిక పుస్తకాలలో రచయితలు వర్ణించే పక్షిలాంటి సాండెర్సీ అంతరించడానికి ఇదమిత్థమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.

231 డైనోసార్ గుడ్లు లభ్యం

231 డైనోసార్ గుడ్లు లభ్యం

బీజింగ్:   ఒకటికాదు రెండు కాదు ఏకంగా 231 రాక్షసబల్లి (డైనోసార్) గుడ్లను ఓ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు చైనా అధికారులు. గుడ్లతోపాటు ఒక డైనోసార్ అస్తిపంజరాన్ని కూడా దొరికింది. సంచలనం రేపిన ఈ సంఘటన గువాంగ్ డోంగ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. జులై 29న స్వాధీనం చేసుకున్న డైనోసార్ గుడ్లకు సంబందించిన వివరాలను స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. 
గడిచిన జూన్ నుంచి జులై వరకు గువాంగ్ డోంగ్ ప్రావిన్స్ రాజధాని హెయువాన్ నగరంలో ఓ ఇంటి నిర్మాణం కోసం జరిపిన పునాది తవ్వకాల్లో శిథిలావస్థలోఉన్న డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. వాటితోపాటు ఓ అస్తిపంజరం కూడా లభించింది. సదరు స్థల యజమాని వీటిని అట్టిపెట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం అతడి ఇంటిపై దాడిచేసి గుడ్లు, అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
నిజానికి హెయువాన్ నగరంలో డైనోసార్ గుడ్లు లభించడం కొత్తేమీకాదు. చైనాలో  డైనోసార్ల స్వస్థలం అని హెయివాన్ నగరానికి పేరుంది. ఇక్కడి మ్యూజియంలో ఇప్పటికే 10వేలకు పైగా రాక్షస బల్లుల గుడ్లున్నాయి. ఆ రకంగా ఈ నగరం గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. కాగా, తవ్వకాల్లో ఏదేనీ వస్తువు లేదా పదార్థం శిథిలావస్థలో దొరితే అది ప్రభుత్వ ఆస్థే అని చైనాలో చట్టం ఉంది. దాని ప్రకారం ఎలాంటి శిధిలాలైనా కంటబడితే వెంటనే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.

తొలిగడప

తొలిగడప

అప్పట్లో ఒక్క డైనసార్ జాతి జంతువులు తప్ప, మిగతావన్నీ మాంసాహారులు. డైనసార్ జాతి జంతువులు మీసోజోయిక్ యుగం ప్రత్యేక కానుక. వీటిల్లో టైరనోసారస్ కులానికి చెందిన జంతువులు తప్ప మిగతావన్నీ శాకాహారులు.
మొసళ్ళ వంటి సరీసృపాలు వెచ్చదనం కోసం ఎండనే వాడుకుంటాయి; పాము, తొండవంటివి అటు ఎండనూ, ఇటు నేలలోని బిలాలనూ ఈ అవసరం కోసం వాడుకుంటాయి. ఇదంతా చెప్పుకునే అవసరం ఎందుకు కలిగిందంటే- నీటిలో జీవులు కొన్ని ఒడ్డును మరగడం, ఒడ్డునుకాదని కొన్ని నేలకు ఎగబాకడం వంటి అలవాట్లు యాదృచ్ఛికంగా జరిగినవి కాదనీ, భౌతికావసరాల ప్రోద్బలంతో జరిగిన పరిణామమనీ మనకు జ్ఞాపకం ఉండేందుకు. జీవిని నివాసం మార్చుకునేలా ప్రోత్సహించే మరో అవసరం ఆహార సంపాదన. నేలమీద అప్పటికే లెక్కలేనన్ని పురుగులు పారాడుతుండడం మూలంగా, వాటిని ఆహారంగా తీసుకునే జీవికి పొడినేల స్వర్గంగా దొరికుండొచ్చు.

ప్యాలియోజోయిక్ యుగాంతంలో పలురకాల అవాంతరాల కారణంగా కొసరూ మొగ్గూ మినహా సమూలంగా అంతరించిన జీవరాసి,  మీసోజోయిక్ యుగంలో మూడుపువ్వులూ ఆరుకాయలుగా విజృంభించింది. మునుపు నీటినే అంటిపెట్టుకుని బ్రతికిన చెట్టూచేమా, బురదగుంటల పొలిమేరలు అతిక్రమించి, పొడినేలకు విస్తరించి, చివరకు పర్వతాల పాదం వరకూ నెరుసుకుపోయింది. ఐతే, ఈ చెట్లన్నీ అప్పటికిగూడా పూలు పూయని ఫెర్న్ జాతులే; కాకపోతే వైవిధ్యం పెద్దగా పెరిగింది. రకాలు ఎన్ని పెరిగినా ఇప్పటి అడవుల్లాగా అవి రంగులతో శోభాయమానమైన అలంకారాలు కావు. వర్షాకాలంలో పచ్చని తివాచీ, ఎండలు పెరిగితే గోధుమరంగు పొడలు. పంచరంగుల్లో కనిపించేవి కొండలమీద రాళ్ళు మాత్రమే. ఆ చెట్లకు పండ్లూ లేవు, విత్తనాలూ లేవు. వాటిని ఆహారంగా వినియోగించుకుని వృక్షజాతులు విస్తరించేందుకు దోహదంచేసే పక్షులు గూడా అప్పట్లో లేవు. అందువల్ల, పర్వతాలూ, వాటి సాణువులూ ఆచ్ఛాదనలేని భూమాత అవయవాలుగా ఉండిపోయాయి.
ప్యాలియోజోయిక్ యుగంలోనే, చివరి శకంలో సరీసృపాలు రూపొందాయని ఇదివరకే అనుకున్నాం. ఆ దశలో వాటి కాళ్ళు ఏమంత బలమైనవిగా ఉండేవిగావు. బానలాటి కడుపును ఈడ్చుకుంటూ అవి ప్రయత్నపూర్వకంగా, నేలమీది కొచ్చిన మొసళ్ళకులాగా, నడిచేవి. మీసోజోయిక్   యుగంలో సరీసృపాలకు కాలిబలం పెరిగి, శరీరభారాన్నంతా నాలుగు కాళ్ళ మీద మోయగలిగే సమర్థత సమకూరింది. ఆ సమర్థతతో అవి తమ సామ్రాజ్యపు సరిహద్దులను అపారంగా విస్తరించడం గమనిస్తే, నేల నుండి ఐదుమైళ్ళు ఎగువకూ నీటిలో మైలుకు తక్కువైన లోతుకూ మాత్రమే పరిమితమైన మానవజీవన పొలిమేరలు ఏదోవొకనాడు అంచనాలకు దొరకనంత విశాలంగా విస్తరించగలవనే నమ్మకం ఏర్పడుతుంది. 

మీసోజోయిక్ యుగంలో నేలను ఆక్రమించిన జంతువులన్నీ బల్లులూ, తొండలూ, తాబేళ్ళ జాతికి చెందిన సరీసృపాలే. వాటిల్లో మొసలి, సముద్రపు తాబేలు వంటి కొన్ని జీవులు తిరిగి నీటిని ఆశ్రయించినా, మిగతావన్నీ నేలమీది జీవితానికే కట్టుబడ్డాయి. వీటిల్లో కొన్ని వెనకకాళ్ళూ తోకల మీద శరీరాన్ని కుదురుజేసి, ఇప్పటి  కంగారూ జంతువుల్లో మనం చూస్తున్నట్టు, ముందుకాళ్ళకు స్వేచ్ఛనిచ్చే అలవాటు చేసుకున్నాయి. అప్పట్లో ఒక్క డైనసార్  జాతి జంతువులు తప్ప, మిగతావన్నీ మాంసాహారులు. డైనసార్ జాతి జంతువులు మీసోజోయిక్ యుగం ప్రత్యేక కానుక. వీటిల్లో  టైరనోసారస్ కులానికి చెందిన జంతువులు తప్ప మిగతావన్నీ శాకాహారులు. 
 డిప్లొడోకస్ అనే జంతువు సగటు కొలత, ముక్కుకొస నుండి తోక చివరికి 84 అడుగులు. ఆఫ్రికా తూర్పుతీరంలో దొరికిన మరో జీవి నూరు అడుగులకు మించిన పొడవును రికార్డు చేసి,  జైగ్యాంటోసారస్ గా పిలువబడింది. ఈ రాక్షసబల్లులు వెనకకాళ్ళనూ తోకనూ ఆపుజేసుకుని నిలుచున్నట్టు చూపుతుంటారుగానీ, అంతపెద్ద శరీర భారాన్ని మోయగల సత్తువ వాటి వెనకకాళ్ళకు కనిపించదు. భారీ శరీరాల మూలంగా గొడ్లలాగా కనిపిస్తాయిగానీ, లక్షణాలరీత్యా అవి నూటికి నూరుపాళ్ళూ సరీసృపాలు. అందుకే వాటికి బయటిచెవి కనిపించదు. 

 ఈ బల్లుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన రకాలు కొన్నున్నాయి. వాటిల్లో ట్రైసెరాటోప్స్  అనే జాతి జంతువుకు మూడు కొమ్ములున్న కారణంగా ఆ పేరొచ్చింది. రెండుకొమ్ములు దాని కళ్ళకు ఎగువనా, మూడవది ముక్కుకు కొసనా ఉంటాయి. పైదవడలో పళ్ళను కాదని ముందుకు పెరిగిన బొమికె చిలకముక్కును పోలి కొనదేరి ఉంటుంది. 

 రెండవది అతి భయంకరమైన  టైరనోసారస్.  ఇది మాంసాహారి. ముక్కునుండి తోకకు దాదాపు 40 అడుగుల పొడవుంటుంది. వెనకకాళ్ళు చాలా దృఢంగా ఉండడంతో, ఇది తన శరీరాన్ని వెనకకాళ్ళూ తోకలమీద మోపుకుని నడవగలిగినట్టు కనిపిస్తుంది. దీని నోరు నాలుగు అడుగుల సొరంగం. తెరిస్తే మూడున్నర అడుగుల సందు విప్పుకుంటుంది. కోర జంపు పన్నెండు అంగుళాలు. పలువరస ఏర్పాటు ఆహారాన్ని నమిలేందుకు అనుకూలించదు గాబట్టి చంపిన వేటను మొత్తంగా మింగేసేదైవుంటుంది.

మూడవరకం జంతువు  థెరియోమార్ఫా అంటే మృగాన్ని పోలినది  అని. పరిమాణం పెద్దగా ఉండదుగాని, దీని ఎముకల అమరికలో  స్తన్యజీవులకు పోలిన మార్పులు కనిపిస్తాయి. అయినా, తరువాతి యుగానికి చెందిన  స్తన్యజీవులకు పూర్వీకులు ఇవేనని కచ్చితంగా చెప్పుకోలేం. మీసోజోయిక్ యుగంలోమ్యామెల్స్ అంటే  స్తన్యజీవులు  లేదా పొదుగుండే జంతువులు - ఉండేవా కాదా అనేది ఇంతదాకా ఇదమిత్థంగా జవాబు దొరకని సందేహం. పొదుగును మాత్రమే కాకుండా, చర్మం మీద బొచ్చును కలిగుండడం స్తన్యజీవుల లక్షణం. ఆ లక్షణాలను కచ్చితంగా సూచించే అవశేషాలు ఈనాటికీ దొరకలేదు. 

ఆ రాక్షసబల్లి వస్తుంటే.. ఏడంతస్తుల మేడ నడిచొచ్చినట్టుండే!

ఆ రాక్షసబల్లి వస్తుంటే..   ఏడంతస్తుల మేడ నడిచొచ్చినట్టుండే!

మనిషి కన్నా పొడవుగా.. పెద్ద సైజు మొద్దులా కనిపిస్తున్న ఇది ఓ రాక్షసబల్లి(డైనోసార్)కి చెందిన తొడ ఎముక. అర్జెంటీనాలోని పాటగోనియాకు 250 కి.మీ. దూరంలో గల లా ఫ్లెచా ఎడారి వద్ద దీనితోపాటు మొత్తం 150 ఎముకలను పురాజీవ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడ దొరికిన భారీ ఎముకలను బట్టి.. ఇవి పొడవైన మెడ, తోకను కలిగి ఉండి, నాలుగు కాళ్లతో నడిచే టిటానోసార్ జాతి డైనోసార్కు చెందినవిగా నిర్ధారించారు. ఈ జాతి రాక్షసబల్లులు సుమారు 9.50 కోట్ల ఏళ్ల క్రితం క్రిటేసియస్ యుగం చివరికాలంలో భూమిపై సంచరించాయట. దీని ఎముకల్లో చిక్కుకుపోయిన రాళ్లను బట్టి కాలాన్ని అంచనా వేశారు. 

అయితే ఇప్పటిదాకా లభ్యమైన శిలాజాలను బట్టిచూస్తే.. ఇదే అతిపెద్ద రాక్షసబల్లి అట. దీని సైజు ఏకంగా 14 ఆఫ్రికన్ ఏనుగులంత ఉండేదట. నోటి నుంచి తోక దాకా 40 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు, 77 టన్నుల బరువు ఉండే ఈ డైనోసార్ కదులుతుంటే.. దాదాపుగా ఏడంతస్తుల మేడ నడిచొచ్చినట్టుగా ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతకుముందు పాటగోనియా ప్రాంతంలోనే దొరికిన శిలాజాలను బట్టి.. అర్జెంటినోసారస్ అనే రాక్షసబల్లే అతిపెద్దది అని గుర్తించారు. తాజాగా ఆ రికార్డును అధిగమించేసిన ఈ రాక్షసబల్లికి ఇంకా పేరుపెట్టలేదు. అన్నట్టూ... ఈ రాక్షసబల్లి పూర్తిగా శాకాహారమే తీసుకునేదట.

Wednesday, 23 September 2015

డైనోసార్ గబ్బిలం!


దేహం చూస్తే.. డైనోసార్. రెక్కలు చూస్తే గబ్బిలం! ‘యీ క్వీ’ అనే ఈ డైనోసార్ గబ్బిలం(డైనోబాట్) 16 కోట్ల ఏళ్ల క్రితం జురాసిక్ యుగం చివరికాలంలో చైనాలో నివసించిందట.ఇది ఇతర డైనోసార్ల కన్నా విభిన్నంగా ఉందని, బహుశా రాక్షసబల్లుల నుంచి పక్షులు పరిణామం చెందడం దీని నుంచే ప్రారంభమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉత్తరచైనాలోని కింగ్లాంగ్ కౌంటీలో ఓ రైతు ఈ పక్షి శిలాజాన్ని గుర్తించాడు. శిలాజాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అప్పట్లో 'యీక్వీ' ఇలా ఉండేదని ఊహారూపమిచ్చేశారు!

Saturday, 5 September 2015

ఆరున్నర అడుగుల పెంగ్విన్


ఇప్పుడు ఎంపరర్ పెంగ్విన్ అతి పెద్దది... కానీ ఒకప్పుడు దీనికో పెద్దన్న ఉండేది... అది ఏకంగా ఆరడుగుల ఎత్తుతో భారీ బరువుండేది... దీని సంగతులు కొత్తగా బయటపడ్డాయి!
పెంగ్విన్లలో అతి పెద్దది ఏదీ అంటే ఎంపరర్ పెంగ్విన్ అని చెబుతారు. ఇది ఇప్పటి మాట. 40 మిలియన్ ఏళ్ల క్రితం అంటే దాదాపు 4 కోట్ల ఏళ్ల క్రితం దీనికన్నా రెట్టింపు సైజులో ఉండే 'Palaeeudyptes klekowskii' అనే భారీ పెంగ్విన్ జాతి బతికేదిట. దీని ఎత్తు ఆరున్నర అడుగులు, బరువేమో 115 కిలోలు ఉండేదిట. అంటే ఇది మనుషులకన్నా ఎక్కువ ఎత్తు ఉండేదన్నమాట. ఇప్పుడున్న అతి పెద్ద పెంగ్విన్‌కు రెట్టింపు పరిమాణంలో ఉండేది.
చి ఈ మధ్యే అంటార్కిటికా ప్రాంతంలోని 'సీమర్ ఐలాండ్' లో ఈ పెంగ్విన్ శిలాజాలు దొరికాయి. ముఖ్యంగా వీటి రెక్కలోని ఒక ఎముక, కాళ్ల దగ్గర ఉండే ఓ ఎముక లభ్యమయ్యాయి. వాటిని శాస్త్రవేత్తలు పరిశోధిస్తే ఈ పెంగ్విన్ రూపురేఖలు, ఇంకా దీని విశేషాలు తెలిశాయి.

* ఈ పెంగ్విన్లు ఒక్కసారి నీళ్లలోకి దూకాయంటే వందలాది అడుగుల లోతుకు డైవ్ చేసి, దాదాపు 40 నిముషాలు చేపలను వేటాడుతూ ఉండేవట.



* ఇవి బతికే కాలంలో అంటార్కిటికా ఇప్పటిలా అత్యల్ప ఉష్ణోగ్రతలతో కాకుండా కాస్త వేడిగా ఉండేదిట. పైగా ఈ భారీ పెంగ్విన్లతోపాటు మరో పది నుంచి పద్నాలుగు జాతుల పెంగ్విన్లు కూడా స్వేచ్ఛగా బతికేవని తేలింది.
మీకు తెలుసా?
* పెంగ్విన్లలో దాదాపు 17 జాతులు ఉన్నాయి. వీటిల్లో అతి పెద్దది ఎంపరర్ పెంగ్విన్. ఇది 3 అడుగుల ఎత్తు, 35 కేజీల బరువు ఉంటుంది. అతి చిన్నది బ్లూ పెంగ్విన్. 16 అంగుళాల ఎత్తు, కేజీ బరువుంటుంది.
* పెంగ్విన్లు సముద్రపు నీరును కూడా తాగగలవు!
*ఉత్తర ధ్రువంలో అస్సలు ఉండవు!
* ఇవి ఎగరలేని పక్షులు
* వీటి రెక్కలు నీళ్లలో తడవవు. అంటే వాటర్‌ప్రూఫ్.

మహా కుందేలు మాట విన్నారా!

ఏ కుందేలునైనా ఎత్తుకోవచ్చు...
కానీ దాన్ని మాత్రం అలా చేయలేరు...
ఎందుకంటే అది మామూలుది కాదు...
మహా కుందేలు!

కుందేలు రెండు కాళ్లమీద కూర్చుంటే దాని ఎత్తు మన పిక్కలను దాటి ఉండదు. కానీ మనిషంత ఎత్తుగా ఉండే కుందేళ్ల గురించి తెలుసా? వాటి గురించే కొత్తగా బయటపడింది. అబ్బా... ఎక్కడున్నాయి చెప్మా' అని ఆశ్చర్యపోయి, వీలుంటే వెళ్లి చూసేద్దామనుకోకండి. ఎందుకంటే అవి ఇప్పటివి కావు. దాదాపు 50 లక్షల ఏళ్ల క్రితం నాటివి. వీటి సంగతి తెలిసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. భూమ్మీద ఇంత పెద్ద కుందేళ్లు ఉన్నట్టు తెలియడం ఇదే తొలిసారి' అంటున్నారు.ఇప్పుడుండే కుందేళ్లు దాదాపు 20 అంగుళాల పొడవుంటాయి. మరి ఆనాటి మహాకుందేలు ఎంత ఉండేదో తెలుసా? ఏకంగా పది అడుగులు! అంటే అది రెండు కాళ్ల మీద ఆనుకుని నుంచుంటే దాదాపు మనిషంత ఎత్తుగా ఉండేదన్నమాట! ఇవి 12 కిలోల బరువుగా ఉండేవి. ఇప్పటి కుందేళ్ల కన్నా ఆరు రెట్లు పెద్దగా ఉండే మరి వీటి గురించి మనకెలా తెలిసింది? శిలాజాల వల్ల. స్పెయిన్‌లో మినోర్కా అనే ఓ దీవి ఉంది. అందులో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే కొన్ని పెద్ద పెద్ద ఎముకల శిలాజాలు దొరికాయి. ముందు ఇవేవో సముద్రపు తాబేలువయి ఉండవచ్చనుకున్నారు. తర్వాత మరింతగా పరిశీలించేసరికి ఇవి కుందేళ్లవని తేలింది. వీటని ముద్దుగా రోలీపోలీ అంటున్నారు.
కుందేలు అనగానే మనకి గుర్తొచ్చేవి పొడవాటి చెవులు కదా, కానీ వీటి చెవులు చిన్నగా ఉన్నాయి. దాన్ని బట్టి పెద్దగా వినికిడి శక్తి ఉండేది కాదని చెబుతున్నారు. అలాగే దీనికి కళ్లు కూడా సరిగా కనిపించేవి కావుట. మరి సరిగా వినిపించని, కనిపించని పరిస్థితుల్లో ఈ కుందేలు ఎలా బతికేది? ఎలాగంటే అవి ఉండే ఆ దీవిలో వాటికి శత్రుజీవులంటూ లేవు. కాబట్టి ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితే లేదు. కాబట్టి ఇవి తాపీగా నేలను తవ్వుకుంటూ కందమూలాలు తింటూ ప్రశాంతంగా కాలం గడిపేసేవి. అందువల్లనే రాన్రానూ వాటి చెవులు, కళ్ల శక్తి తగ్గిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మీకు తెలుసా?
* ప్రపంచంలో ప్రస్తుతం 50 జాతుల కుందేళ్లు ఉన్నాయి
* ఇవి 150 రంగుల్లో ఉంటాయి
* 12 ఏళ్ల వరకు బతుకుతాయి
* వీటి పళ్లు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి

అతిపెద్ద మొసలి

27 అడుగుల పొడవు... అతిపెద్ద మొసలి... మనిషిని అమాంతం మింగగలదు... అదేంటో? దాని విశేషాలేంటో తెలుసుకోండి!
లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఒక మంచి నీటి చెరువు ఉండేది. చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఆ నీటినే తాగి బతికేవారు. నీటి కోసం చెరువు దగ్గరికి వెళ్లిన వారిలో, సగం మంది వెనక్కి వచ్చే వారు కాదు. మరి ఏమయ్యే వారు? ఆ చెరువులో ఉన్న పెద్ద పెద్ద మొసళ్లకు ఆహారమైపోయేవారు. ఇలా ఒక్క ఈ చెరువు దగ్గరే కాదు, చుట్టుపక్కల ఉన్న సరస్సులన్నింటి దగ్గరా ఇదే పరిస్థితి. అలా మన పూర్వీకులని పొట్టన బెట్టుకున్న మొసలి సంగతుల్ని ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొసళ్లు సుమారు 27 అడుగుల పొడవుండేవట. ఆఫ్రికా ఖండంలో తిరిగిన అన్ని మొసళ్లలో ఇవే పెద్దవి. సుమారు 20 లక్షల నుంచి 40 లక్షల ఏళ్ల మధ్య కాలంలో బతికేవి.
లక్షల ఏళ్ల క్రితం బతికిన మొసళ్ల గురించి ఇప్పుడు మనకెలా తెలిసింది? శిలాజాల వల్ల. కెన్యాలోని ఓ ఎండిపోయిన చెరువులో దీని శిలాజాలు దొరికాయి. వాటిలో ఓ పెద్ద తల కూడా ఉంది. ఇది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితమే దొరికినా ఒక మ్యూజియంలో పెట్టి ఊరుకున్నారు. అయితే ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు మ్యూజియానికి వెళ్లనప్పుడు దీన్ని చూసి పరిశోధన చేసేసరికి మహామొసళ్ల ఆనవాళ్లు చిక్కాయి. మ్యూజియంలో ఉంచిన మొసలి తలను మోయడానికి నలుగురు మనుషులు కావల్సి వచ్చింది.

అప్పట్లో మనుషుల్ని ఇవి అమాంతం మింగేయగలిగేంత పెద్దగా ఉండేవని చెబుతున్నారు. అలా మింగేసిన తరువాత రాళ్లు కూడా మింగేవి. ఎందుకో తెలుసా? దాని కడుపులో ఆ రాళ్లు గిరగిరా తిరగడం వల్ల మింగిన జంతువు మొత్తం రుబ్బురోట్లో పడినట్టు ఎముకలతో సహా నుజునుజ్జయిపోయి అరిగిపోయేది.

రాకాసి స్లోత్‌ల రహస్యం తెలిసింది!

బద్ధకానికి మారుపేరైన స్లోత్‌లు తెలుసు... వీటి గురించి కొత్త సంగతి బయటపడింది... అదేంటో తెలుసా? కదలడంలో నెమ్మదైనా పరిణామంలో ఇవి వేగమేనట!


స్లోత్‌లది వింతైన రూపం. రోజులో ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతాయి. బద్ధకానికి మారుపేరుగా పిలుస్తారు. అయితే ఈ జీవిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే ఒక కొత్త సంగతి తెలిసింది.
చి ఇప్పటి స్లోత్‌లు కుక్కంత సైజు, ఎనిమిది కేజీల బరువుతో ఉంటాయి. కానీ 11వేల ఏళ్ల క్రితం ఏకంగా ఏనుగంత పెద్దగా ఉండేవి. వాటిని చూస్తే ఏ జీవికైనా హడలు పుట్టేదట. స్లోత్‌లు ఒకప్పుడు అంత పెద్దగా ఉండేవనే సంగతి గతంలోనే తెలుసు.

* ఇప్పుడు కొత్తగా బయటపడ్డ విషయమేంటంటే... వీటి శరీర పరిణామక్రమం చాలా వేగంగా పెరిగిందని. ఎంతంటే లక్ష ఏళ్లకోసారి వీటి బరువు 100 కేజీలు పెరిగేదిట. అంటే లక్షలాది ఏళ్ల క్రితం చిన్నగా ఉన్న స్లోత్‌లు క్రమంగా పెద్దగా పెరుగుతూ వచ్చి ఏనుగంత సైజుకు చేరుకున్నాయి.


* అయినా లక్ష ఏళ్లకు వంద కేజీల పెరుగుదల అంటే తక్కువేగా అంటారేమో! క్షీరదాల్లో మరే జీవి బరువు ఇంత వేగంగా పెరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

*  ఏనుగంత పెద్దగా ఉన్న ఈ స్లోత్ జాతి పేరు ్ఝ్ఠ్ణ్చ్మ్త్ఠ్్ౖయ్ఝ, ఇవి ఉత్తర అమెరికా ఖండంలో తిరగాడేవి. వీటిని జెయింట్ స్లోత్ అంటారు. వీటి గోళ్లే ఒక అడుగు పొడవు ఉండేవి. అంటే కత్తుల్లా కనిపించేవి.

* జెయింట్ స్లోత్ జాతి 11,000 ఏళ్ల క్రితం వాతావరణ మార్పుల వల్ల పూర్తిగా అంతరించిపోయింది!

మీకు తెలుసా?
* ఇప్పుడున్న స్లోత్‌లలో 6 జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని రెండు వేళ్లవి, మరికొన్ని మూడు వేళ్లవి.
* స్లోత్‌లు ఇప్పుడు దక్షిణ అమెరికా అడవుల్లో మాత్రమే జీవిస్తాయి!
* ఇవి రోజులో 15 నుంచి 20 గంటలు నిద్రిస్తాయి. అదీ చెట్లమీదే!
* వారానికి ఒకసారి మూత్ర విసర్జనకు, జలకాలాటకు చెట్లు దిగి కిందికి వస్తాయంతే! వీటి నడక, చెట్లు ఎక్కడం చాలా నిదానంగా ఉంటుంది. నిముషానికి అయిదారు అడుగుల దూరం నడవగలవు!
* ఆహారం జీర్ణం కావడానికి సుమారు నెల రోజులు పడుతుంది!

రెండు తోకలున్న పక్షి....జిహోలార్నిస్


రెక్కలకు గోళ్లు... రెండు తోకలు... అందమైన రూపం... ఏంటీ వింత జీవి అనుకుంటున్నారా?
రెండు తలల పాములు ఉంటాయని వినుంటారు. కానీ రెండు తోకలున్న పక్షి ఒకటి ఉందని తెలుసా? భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ మనం దాన్ని ఫొటోల్లో చూడాల్సిందే. నిజంగా చూడలేం. ఎందుకంటే ఇది బతికింది కోటానుకోట్ల ఏళ్ల క్రితం. డైనోసార్లు ఈ భూమిపై తిరగాడిన కాలంలో. అయితే ఈ వింత పక్షి శిలాజాలను బట్టి కంప్యూటర్లలో దీన్ని రూపు గీస్తే దీని గురించి బోలెడు వింత నిజాలు బయటపడ్డాయి.
* ఈ పక్షి పేరు జిహోలార్నిస్ (jeholornis). ఇది ఎప్పుడో 120 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే సుమారు 12 కోట్ల ఏళ్ల క్రితం చైనా భూభాగంలో జీవించేది.
* నలుపు రంగులో ఉండే పొడవైన దేహం, తలపై ఎర్రటి కిరీటం లాంటి భాగం... దీనికి తోడు రెండు తోకలతో ఉండే ఈ వింత పక్షి మనం చూసే కోడంత పరిమాణంలో ఉండేది.
* దీని మరో ప్రత్యేకతేంటో తెలుసా? కాళ్ల గోళ్లతోపాటు రెక్కలకు కూడా పదునైన గోళ్లుండేవట.
* ఈ పక్షి శిలాజాలు కొన్ని దశాబ్దాల క్రితమే దొరికాయి. అప్పుడు దీనిపై పరిశోధనలు మొదలెట్టారు. మొదట్లో ఈ పక్షికి ఒకే పేద్ద తోక ఉందని, అది అలంకరణ కోసం మాత్రమే ఉన్నట్టు భావించారు. కానీ అత్యాధునిక పరికరాలతో చేసిన పరిశీలనల్లో దీని శిలాజాల ఆధారంగా ఈ పక్షికి రెండు తోకలున్నట్టు కనుగొని, అంతా ఆశ్చర్యపోయారు.
* వెనక భాగంలో ఉండే దీని రెండు తోకల్లో ఒకటి పొడవుగా ఉండి చివరన ఈకలతో ఉంటుంది. మరోటి చిన్నగా మిగతా పక్షుల తోకల్లానే ఉంటుంది.
* దీనికున్న ఈ భిన్న లక్షణాలన్నీ ఇవి హాయిగా జీవనం గడపడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తోడ్పడేవి.
*  రెండు తోకల్లో చిన్నది ఎగరడానికి, పెద్దది ఈ పక్షి అందాన్ని చూపడానికి ఉపయోగపడేది. దీని పొడవాటి తోకపై చిన్నపాటి ఫ్యాన్ రెక్కల్లాంటి ఈకలు ఉండేవి. ఇవీ ఆకర్షణకే పనికొచ్చేవి.

కోర పళ్లు క్రూర మృగాలకేనా? ఓ ఉడతకు కూడా ఉన్నాయి!


కోర పళ్లు క్రూర మృగాలకేనా? ఓ ఉడతకు కూడా ఉన్నాయి! ఏమా ఉడత? ఏమా కథ?
అనగనగా ఓ ఉడత ఉండేది. దానికి కోర పళ్లు ఉండేవి. పైగా నోట్లోంచి బయటకు పొడుచుకు వచ్చినట్టుండేవి... ఇదేమీ కథ కాదు. శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం. అయితే ఈ ఉడత ఇప్పటిది కాదు. అనగనగా 9 కోట్ల సంవత్సరాల క్రితంది! అప్పట్లో భూమ్మీద రాకాసి బల్లులు ఎడాపెడా తిరిగేస్తూ ఉండేవని తెలుసుగా? ఇది కూడా వాటితో పాటే జీవించేది. వాళ్ల అడుగుల కింద పడి నలిగిపోకుండా రాళ్ల సందుల్లో నక్కి నక్కి కాలం గడిపేది. అప్పట్లో జంతువులన్నీ పెద్ద ఆకారాలతో ఉండేవి కదా? ఇది మాత్రం అలా కాదు. కేవలం చుంచెలుకంత ఉండేదంతే. ఇక దీని రూపం ఎలా ఉండేదో తెలుసా? 'ఐస్ ఏజ్' సినిమాలో కోరల పళ్ల ఉడత స్క్రాట్ తెలుసుగా. దాన్ని అచ్చుగుద్దినట్టే ఇదీ ఉండేది.
కోట్లాది ఏళ్ల క్రితం జీవించిన జంతువుల ఎముకల్లో కొన్ని శిలాజాలుగా మారతాయని చదువుకుని ఉంటారు కదా? అలాంటి శిలాజంలాగే ఈ ఉడుత పుర్రె మారిపోయింది. అది ఈ మధ్య అర్జెంటీనాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. దాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు అత్యాధునిక యంత్రాల ద్వారా పరీక్షించారు. ఆపై కంప్యూటర్ల ద్వారా దీనికి రూపం కల్పించారు.

ఇది కేవలం 4 నుంచి 6 అంగుళాల పరిమాణంతో వంకర ముక్కు, గుండ్రటి తల, పేద్దపేద్ద కళ్లతో ఉండేది. దీనికి క్రొనోపియో డెంటియాక్టస్ అని పేరు పెట్టారు. ఆ పేరు నోరు తిరగదు కాబట్టి మనం కోరల ఉడతనుకుందాం. ప్రత్యేకమైన దవడలతో దీని పళ్లు చాలా పదునుగా ఉండేవి. ఎక్కువగా రాత్రిళ్లు మాత్రమే ఆహారం కోసం బయటకొచ్చి గుట్టుగా బతికేది. ఇంతకీ దీనికి ఇలాంటి కోరల పళ్లు ఎందుకు ఉండేవి? జంతువుల అవయవాలు వాటి అవసరాలు, పరిసరాల మీద ఆధారపడి పరిణామం చెందేవని తెలుసు కదా? అలా అప్పట్లో ఈ ఉడత ఉండే ప్రాంతంలో ఆహారం సంపాదించుకోవాలంటే ఇలాంటి కోరపళ్ల అవసరం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కన్నులన్నిటిలోకి ఏ కళ్లు మేలు?

ఆ కళ్లే కళ్లు... ఆ చూపే చూపు... ఏ జీవికీ లేనేలేవు... అంటున్నారు శాస్త్రవేత్తలు! ఇంతకీ ఆ కళ్లు ఎవరివి?


అనగనగా ఒక జీవి. దానికి రెండు కళ్లు. ఆ కళ్లలోకి కళ్లు పెట్టి చూశారు శాస్త్రవేత్తలు. వాళ్ల కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆపై పరిశోధన చేసి 'ఇలాంటి కళ్లు ఈ భూమ్మీద ఇప్పటి వరకు బతికిన ఏ జీవికీ లేవు' అని ప్రకటించారు. ఆ జీవి ఏంటో తెలుసా? 'అనోమలోకరిస్'. ఆ పేరు వాళ్లే పెట్టారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? వింతయిన జలచరం అని! అసలీ పేరే వినలేదు కదూ? నిజమే. ఎందుకంటే ఈ జీవి ఇప్పుడు లేదు. ఎప్పుడో 55 కోట్ల ఏళ్ల కిందట సముద్రాల్లో జీవించింది. ఇప్పటి 'ష్రింప్'లనే ఒక రకం రొయ్యల్లాంటి జీవులకి ముత్తాతలాంటి దన్నమాట.
ఇంతకీ దాని కళ్లలో అంత విచిత్రమైన విషయం ఏమిటి? దాని ఒకో కంటిలో ఏకంగా 30,000 పైగా కటకాలు ఉన్నాయని కనిపెట్టారు! మన కంటిలో ఒకటే కటకం ఉంటుంది. కీటకాలు, ఈగలు, తూనీగలు లాంటి కొన్ని జీవుల్లో ఎక్కువ కటకాలు ఉంటాయి. ఇలాంటి కళ్లను 'కాంపౌండ్ ఐస్' అంటారు. ఇన్నేసి కటకాలున్నా వాటికి కనిపించేది ఒక దృశ్యమే. అంటే ఒకో భాగాన్ని ఒకో కటకం గుర్తించినా, మొత్తం అన్నీ కలిసిన దృశ్యాన్నే అవి చూడగలుగుతాయి. అయితే ఈ చూపు వల్ల స్పష్టతతో పాటు పరిసరాల్లో చిన్న కదలికలను కూడా అవి గ్రహించగలుగుతాయి.

ఆస్ట్రేలియాలోని ఓ దీవిలో శిలాజ రూపంలో కనిపించిన ఈ కొత్త జీవి రూపం కూడా చిత్రంగా ఉంది. సుమారు ఆరడుగుల పొడవుగా ఉండే దీని కళ్లు ఒకోటీ మూడు సెంటీమీటర్ల గోళాల్లాగా ఉండి తల మీంచి బయటికి పొడుచుకొచ్చాయి. ఆ కళ్లకి దగ్గరగా తల మీదనే ఏడేసి అంగుళాల పొడవైన రెండు చేతులు ఉన్నాయి. ఇక దీని నోరు కూడా అనేక సూక్ష్మ దంతాలతో 32 భాగాలుగా ఉంది. దీని శిలాజాన్ని శాస్త్రవేత్తలు ఎలక్రానిక్ సూక్ష్మదర్శినితో పరిశీలించి పరిశోధన చేశారు. జీవుల్లో 'కాంపౌండ్ ఐస్' మనం అనుకున్నదాని కంటే చాలా కాలం క్రితమే అభివృద్ధి చెందాయని కూడా దీని వల్ల తెలుస్తోందని చెబుతున్నారు.

మరి ఇప్పుడు ఉన్న జీవుల్లో దీనికి సాటిగా ఏ జీవీ లేదా? ఉంది. అదే తూనీగ. దాని ఒకో కంటిలో సుమారు 28,000 కటకాలు ఉంటాయి.

తిమింగలం ముత్తాత్తాత!


కోరపళ్లు... కొనదేలిన నోరు... 20 అడుగుల పొడవు... ఇవన్నీ ఓ తిమింగలం తాతగారి విశేషాలు!

ప్రపంచంలోనే అతి పెద్ద జీవి ఏది? అనడిగితే తిమింగలం అని చెపుతారు. ఇప్పుడు ఈ తిమింగలం ముత్తాత్తాత ఆచూకీ దొరికింది. ఆయనగారి రూపమే విచిత్రం. మూతి నుంచి తోక దాకా 20 అడుగులే ఉన్నా ఆయనగారి దవడలే 60 అంగుళాల పొడవుగా ఉండేవి. నోరు తెరిచారంటే పైన, కింద కొనదేలిన కోర పళ్లే. కనిపించిన పెద్ద పెద్ద పెంగ్విన్లను, షార్కులను కరకరలాడించేసే వారు. ఇంతకీ ఈయనగారు ఈదులాడిన కాలం ఎప్పటిదో తెలుసా? దాదాపు 4 కోట్ల 90 లక్షల నాటిది! మరి అప్పట్లో ఆయన ఇలాగే ఉండేవారని ఎలా తెలుసు? పురాతన జంతువుల అవశేషాలు భూమి లోపల మార్పుల వల్ల శిలాజాలుగా మారతాయని తెలుసు కదా. అలా ఆయనగారి దవడ ఎముక శిలాజంగా మారింది. అది ఈమధ్యనే దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలో శాస్త్రవేత్తలకు దొరికింది. దాన్ని పరీక్షించి, దాని రూపం ఎలా ఉంటుందో ఊహించారన్నమాట. ఇంతవరకు మనకు దొరికిన తిమింగలాల శిలాజాల్లో ఇదే అతి ప్రాచీనమైనది. అందుకే ఇది తిమింగలం ముత్తాత్తాతని తేల్చారు.
ఇప్పుడంటే తిమింగలాలు కేవలం నీళ్లల్లో మాత్రమే ఉంటున్నాయి కానీ, ఒకప్పుడు ఇవి ఉభయచరజీవులు. అంటే కప్పల్లాగా నీటిలోనూ, భూమి మీద కూడా బతకగలిగేవి. ఎక్కువ శాతం ఆహారాన్ని ఒడ్డుకొచ్చే వెతుక్కునేవి. అలాంటి తిమింగలాలు పూర్తిగా జలచరాలుగా మారడానికి కనీసం కోటిన్నర ఏళ్లయినా పట్టి ఉంటుందని ఇంతవరకు అనుకునేవారు. కానీ ఈ ముత్తాత్తాతగారి దవడ శిలాజం మీద జరిగిన పరిశోధన వల్ల కేవలం 40 లక్షల కాలంలోనే ఈ మార్పు ఏర్పడిందని తెలుసుకున్నారు. అంతేకాదు ఈ శిలాజం పరిశీలన వల్ల కోట్లాది ఏళ్లనాటి వాతావరణ పరిస్థితులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి ముత్తాత్తాతగారు చాలా విషయాలే చెప్పారన్నమాట.

మీకు తెలుసా?
* ప్రపంచంలో సుమారు 85 జాతుల తిమింగలాలు ఉన్నాయి.
* వాటిల్లో అతి పెద్దది నీలి తిమింగలం. ఇది సుమారు వంద అడుగుల పొడవు, 181 టన్నుల బరువు పెరుగుతుంది. రోజుకి అయిదు టన్నుల ఆహారాన్ని తీసుకుంటుంది.
* అతి చిన్నది డ్వార్ఫ్‌స్పెర్మ్ తిమింగలం. ఇది 2.7 మీటర్ల పొడవు, 272 కిలోగ్రాముల బరువు పెరుగుతుంది.

చైనాలో పొడవాటి మెడ ఉన్న డైనోసార్ గుర్తింపు

Long-necked dinosaur discovered in China Beijing,

పొడవాటి మెడ ఉన్న కొత్త జాతికి చెందిన డైనోసార్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 160 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ డైనోసార్ భూమిపై నివసించిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘డ్రాగన్ ఆఫ్ కిజియాంగ్‌’ గా పిలువబడే ఈ డైనోసార్‌కు సంబంధించిన ఆనవాళ్లను చైనాలోని చోంగ్‌కింగ్‌కు సమీపంలోని కిజియాంగ్ పట్టణంలో గుర్తించినట్టు వెల్లడించారు. 15 మీటర్ల పొడవున్న కిజియాంగ్ లేట్ జురాసిక్ కాలంలో జీవించి ఉండేదని తెలిపారు.