ఇప్పుడు ఎంపరర్ పెంగ్విన్ అతి పెద్దది... కానీ ఒకప్పుడు దీనికో పెద్దన్న ఉండేది... అది ఏకంగా ఆరడుగుల ఎత్తుతో భారీ బరువుండేది... దీని సంగతులు కొత్తగా బయటపడ్డాయి!
పెంగ్విన్లలో అతి పెద్దది ఏదీ అంటే ఎంపరర్ పెంగ్విన్ అని చెబుతారు. ఇది ఇప్పటి మాట. 40 మిలియన్ ఏళ్ల క్రితం అంటే దాదాపు 4 కోట్ల ఏళ్ల క్రితం దీనికన్నా రెట్టింపు సైజులో ఉండే 'Palaeeudyptes klekowskii' అనే భారీ పెంగ్విన్ జాతి బతికేదిట. దీని ఎత్తు ఆరున్నర అడుగులు, బరువేమో 115 కిలోలు ఉండేదిట. అంటే ఇది మనుషులకన్నా ఎక్కువ ఎత్తు ఉండేదన్నమాట. ఇప్పుడున్న అతి పెద్ద పెంగ్విన్‌కు రెట్టింపు పరిమాణంలో ఉండేది.
చి ఈ మధ్యే అంటార్కిటికా ప్రాంతంలోని 'సీమర్ ఐలాండ్' లో ఈ పెంగ్విన్ శిలాజాలు దొరికాయి. ముఖ్యంగా వీటి రెక్కలోని ఒక ఎముక, కాళ్ల దగ్గర ఉండే ఓ ఎముక లభ్యమయ్యాయి. వాటిని శాస్త్రవేత్తలు పరిశోధిస్తే ఈ పెంగ్విన్ రూపురేఖలు, ఇంకా దీని విశేషాలు తెలిశాయి.
* ఈ పెంగ్విన్లు ఒక్కసారి నీళ్లలోకి దూకాయంటే వందలాది అడుగుల లోతుకు డైవ్ చేసి, దాదాపు 40 నిముషాలు చేపలను వేటాడుతూ ఉండేవట.

* ఇవి బతికే కాలంలో అంటార్కిటికా ఇప్పటిలా అత్యల్ప ఉష్ణోగ్రతలతో కాకుండా కాస్త వేడిగా ఉండేదిట. పైగా ఈ భారీ పెంగ్విన్లతోపాటు మరో పది నుంచి పద్నాలుగు జాతుల పెంగ్విన్లు కూడా స్వేచ్ఛగా బతికేవని తేలింది.
మీకు తెలుసా?
* పెంగ్విన్లలో దాదాపు 17 జాతులు ఉన్నాయి. వీటిల్లో అతి పెద్దది ఎంపరర్ పెంగ్విన్. ఇది 3 అడుగుల ఎత్తు, 35 కేజీల బరువు ఉంటుంది. అతి చిన్నది బ్లూ పెంగ్విన్. 16 అంగుళాల ఎత్తు, కేజీ బరువుంటుంది.
* పెంగ్విన్లు సముద్రపు నీరును కూడా తాగగలవు!
*ఉత్తర ధ్రువంలో అస్సలు ఉండవు!
* ఇవి ఎగరలేని పక్షులు
* వీటి రెక్కలు నీళ్లలో తడవవు. అంటే వాటర్‌ప్రూఫ్.

No comments:
Post a Comment