కోర పళ్లు క్రూర మృగాలకేనా? ఓ ఉడతకు కూడా ఉన్నాయి! ఏమా ఉడత? ఏమా కథ?
అనగనగా ఓ ఉడత ఉండేది. దానికి కోర పళ్లు ఉండేవి. పైగా నోట్లోంచి బయటకు పొడుచుకు వచ్చినట్టుండేవి... ఇదేమీ కథ కాదు. శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం. అయితే ఈ ఉడత ఇప్పటిది కాదు. అనగనగా 9 కోట్ల సంవత్సరాల క్రితంది! అప్పట్లో భూమ్మీద రాకాసి బల్లులు ఎడాపెడా తిరిగేస్తూ ఉండేవని తెలుసుగా? ఇది కూడా వాటితో పాటే జీవించేది. వాళ్ల అడుగుల కింద పడి నలిగిపోకుండా రాళ్ల సందుల్లో నక్కి నక్కి కాలం గడిపేది. అప్పట్లో జంతువులన్నీ పెద్ద ఆకారాలతో ఉండేవి కదా? ఇది మాత్రం అలా కాదు. కేవలం చుంచెలుకంత ఉండేదంతే. ఇక దీని రూపం ఎలా ఉండేదో తెలుసా? 'ఐస్ ఏజ్' సినిమాలో కోరల పళ్ల ఉడత స్క్రాట్ తెలుసుగా. దాన్ని అచ్చుగుద్దినట్టే ఇదీ ఉండేది.
కోట్లాది ఏళ్ల క్రితం జీవించిన జంతువుల ఎముకల్లో కొన్ని శిలాజాలుగా మారతాయని చదువుకుని ఉంటారు కదా? అలాంటి శిలాజంలాగే ఈ ఉడుత పుర్రె మారిపోయింది. అది ఈ మధ్య అర్జెంటీనాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. దాన్ని భూగర్భ శాస్త్రవేత్తలు అత్యాధునిక యంత్రాల ద్వారా పరీక్షించారు. ఆపై కంప్యూటర్ల ద్వారా దీనికి రూపం కల్పించారు.
ఇది కేవలం 4 నుంచి 6 అంగుళాల పరిమాణంతో వంకర ముక్కు, గుండ్రటి తల, పేద్దపేద్ద కళ్లతో ఉండేది. దీనికి క్రొనోపియో డెంటియాక్టస్ అని పేరు పెట్టారు. ఆ పేరు నోరు తిరగదు కాబట్టి మనం కోరల ఉడతనుకుందాం. ప్రత్యేకమైన దవడలతో దీని పళ్లు చాలా పదునుగా ఉండేవి. ఎక్కువగా రాత్రిళ్లు మాత్రమే ఆహారం కోసం బయటకొచ్చి గుట్టుగా బతికేది. ఇంతకీ దీనికి ఇలాంటి కోరల పళ్లు ఎందుకు ఉండేవి? జంతువుల అవయవాలు వాటి అవసరాలు, పరిసరాల మీద ఆధారపడి పరిణామం చెందేవని తెలుసు కదా? అలా అప్పట్లో ఈ ఉడత ఉండే ప్రాంతంలో ఆహారం సంపాదించుకోవాలంటే ఇలాంటి కోరపళ్ల అవసరం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

No comments:
Post a Comment