రెక్కలకు గోళ్లు... రెండు తోకలు... అందమైన రూపం... ఏంటీ వింత జీవి అనుకుంటున్నారా?
రెండు తలల పాములు ఉంటాయని వినుంటారు. కానీ రెండు తోకలున్న పక్షి ఒకటి ఉందని తెలుసా? భలే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ మనం దాన్ని ఫొటోల్లో చూడాల్సిందే. నిజంగా చూడలేం. ఎందుకంటే ఇది బతికింది కోటానుకోట్ల ఏళ్ల క్రితం. డైనోసార్లు ఈ భూమిపై తిరగాడిన కాలంలో. అయితే ఈ వింత పక్షి శిలాజాలను బట్టి కంప్యూటర్లలో దీన్ని రూపు గీస్తే దీని గురించి బోలెడు వింత నిజాలు బయటపడ్డాయి.
* ఈ పక్షి పేరు జిహోలార్నిస్ (jeholornis). ఇది ఎప్పుడో 120 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే సుమారు 12 కోట్ల ఏళ్ల క్రితం చైనా భూభాగంలో జీవించేది.
* నలుపు రంగులో ఉండే పొడవైన దేహం, తలపై ఎర్రటి కిరీటం లాంటి భాగం... దీనికి తోడు రెండు తోకలతో ఉండే ఈ వింత పక్షి మనం చూసే కోడంత పరిమాణంలో ఉండేది.
* దీని మరో ప్రత్యేకతేంటో తెలుసా? కాళ్ల గోళ్లతోపాటు రెక్కలకు కూడా పదునైన గోళ్లుండేవట.
* ఈ పక్షి శిలాజాలు కొన్ని దశాబ్దాల క్రితమే దొరికాయి. అప్పుడు దీనిపై పరిశోధనలు మొదలెట్టారు. మొదట్లో ఈ పక్షికి ఒకే పేద్ద తోక ఉందని, అది అలంకరణ కోసం మాత్రమే ఉన్నట్టు భావించారు. కానీ అత్యాధునిక పరికరాలతో చేసిన పరిశీలనల్లో దీని శిలాజాల ఆధారంగా ఈ పక్షికి రెండు తోకలున్నట్టు కనుగొని, అంతా ఆశ్చర్యపోయారు.
* వెనక భాగంలో ఉండే దీని రెండు తోకల్లో ఒకటి పొడవుగా ఉండి చివరన ఈకలతో ఉంటుంది. మరోటి చిన్నగా మిగతా పక్షుల తోకల్లానే ఉంటుంది.
* దీనికున్న ఈ భిన్న లక్షణాలన్నీ ఇవి హాయిగా జీవనం గడపడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తోడ్పడేవి.
* రెండు తోకల్లో చిన్నది ఎగరడానికి, పెద్దది ఈ పక్షి అందాన్ని చూపడానికి ఉపయోగపడేది. దీని పొడవాటి తోకపై చిన్నపాటి ఫ్యాన్ రెక్కల్లాంటి ఈకలు ఉండేవి. ఇవీ ఆకర్షణకే పనికొచ్చేవి.

No comments:
Post a Comment