ఏ కుందేలునైనా ఎత్తుకోవచ్చు...
కానీ దాన్ని మాత్రం అలా చేయలేరు...
ఎందుకంటే అది మామూలుది కాదు...
మహా కుందేలు!
కుందేలు రెండు కాళ్లమీద కూర్చుంటే దాని ఎత్తు మన పిక్కలను దాటి ఉండదు. కానీ మనిషంత ఎత్తుగా ఉండే కుందేళ్ల గురించి తెలుసా? వాటి గురించే కొత్తగా బయటపడింది. అబ్బా... ఎక్కడున్నాయి చెప్మా' అని ఆశ్చర్యపోయి, వీలుంటే వెళ్లి చూసేద్దామనుకోకండి. ఎందుకంటే అవి ఇప్పటివి కావు. దాదాపు 50 లక్షల ఏళ్ల క్రితం నాటివి. వీటి సంగతి తెలిసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు. భూమ్మీద ఇంత పెద్ద కుందేళ్లు ఉన్నట్టు తెలియడం ఇదే తొలిసారి' అంటున్నారు.ఇప్పుడుండే కుందేళ్లు దాదాపు 20 అంగుళాల పొడవుంటాయి. మరి ఆనాటి మహాకుందేలు ఎంత ఉండేదో తెలుసా? ఏకంగా పది అడుగులు! అంటే అది రెండు కాళ్ల మీద ఆనుకుని నుంచుంటే దాదాపు మనిషంత ఎత్తుగా ఉండేదన్నమాట! ఇవి 12 కిలోల బరువుగా ఉండేవి. ఇప్పటి కుందేళ్ల కన్నా ఆరు రెట్లు పెద్దగా ఉండే మరి వీటి గురించి మనకెలా తెలిసింది? శిలాజాల వల్ల. స్పెయిన్‌లో మినోర్కా అనే ఓ దీవి ఉంది. అందులో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే కొన్ని పెద్ద పెద్ద ఎముకల శిలాజాలు దొరికాయి. ముందు ఇవేవో సముద్రపు తాబేలువయి ఉండవచ్చనుకున్నారు. తర్వాత మరింతగా పరిశీలించేసరికి ఇవి కుందేళ్లవని తేలింది. వీటని ముద్దుగా రోలీపోలీ అంటున్నారు.
కుందేలు అనగానే మనకి గుర్తొచ్చేవి పొడవాటి చెవులు కదా, కానీ వీటి చెవులు చిన్నగా ఉన్నాయి. దాన్ని బట్టి పెద్దగా వినికిడి శక్తి ఉండేది కాదని చెబుతున్నారు. అలాగే దీనికి కళ్లు కూడా సరిగా కనిపించేవి కావుట. మరి సరిగా వినిపించని, కనిపించని పరిస్థితుల్లో ఈ కుందేలు ఎలా బతికేది? ఎలాగంటే అవి ఉండే ఆ దీవిలో వాటికి శత్రుజీవులంటూ లేవు. కాబట్టి ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితే లేదు. కాబట్టి ఇవి తాపీగా నేలను తవ్వుకుంటూ కందమూలాలు తింటూ ప్రశాంతంగా కాలం గడిపేసేవి. అందువల్లనే రాన్రానూ వాటి చెవులు, కళ్ల శక్తి తగ్గిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మీకు తెలుసా?
* ప్రపంచంలో ప్రస్తుతం 50 జాతుల కుందేళ్లు ఉన్నాయి
* ఇవి 150 రంగుల్లో ఉంటాయి
* 12 ఏళ్ల వరకు బతుకుతాయి
* వీటి పళ్లు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి

No comments:
Post a Comment