Thursday, 21 May 2015

నీలి చే పమ్మ....నీ విలువ తెలిసింది!(బ్లూ పేరెట్ ఫిష్)




ఈ నీలి చేపను చూశారా? భలే ఉంది కదూ! రూపమే కాదు, దీని వల్ల ఉన్న ఉపయోగం కూడా అంతా ఇంతా కాదు తెలుసా? ఇప్పుడు ఈ చేపను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు తెగేసి చెబుతున్నారు.

*దీని పేరు బ్లూ ప్యారట్ ఫిష్. ఈ చేపలు ఎక్కువగా కోరల్ రీఫ్ రాళ్ల దగ్గర ఉంటాయి. ఈ చేప సుమారు 29 అంగుళాల వరకు ఎదుగుతుంది. నోట్లో దంతాలతో పాటు దీనికి గొంతులోనూ పళ్లుంటాయి. వీటిని పారింగ్జల్ టూత్ అంటారు. చిలుక ముక్కులాంటి దీని దవడ, దంతాలతో రాళ్లపై ఉన్న ఆల్గేను తొలుస్తూ కడుపు నింపుకుంటుంది. గొంతులోని పళ్లతో ఏకంగా రాళ్లనే ఇసుకలా తొలిచి అందులో నాచును తినేస్తుంది. అలా రోజు మొత్తంలో 80 శాతం సమయం ఇది ఆహార వేటలో గడుపుతుంది.

* ఈ చేప ఆల్గేను తిని రీఫ్‌లపై దాని వ్యాప్తిని ఆపడం ద్వారా మిగతా చేపలకు కూడా రీఫ్‌లు ఆవాసమవుతున్నాయి. కానీ ఈ నీలి చేప క్రమంగా అంతరించిపోతుండడం వల్ల రీఫ్‌లపై నాచు అధికంగా పేరుకుపోయి బోలెడు చేప జాతులకు నష్టం కలుగుతోంది. ముఖ్యంగా బ్రెజిల్‌లోని సముద్రాల్లోని రీఫ్‌లు బాగా దెబ్బతింటున్నాయట. అందుకే నీలి చేపమ్మా నీ విలువ తెలిసింది అంటూ శాస్త్రవేత్తలు ఈ చేపను కాపాడే చర్యలు మొదలెట్టారు.

* చిలక ముక్కులాంటి దవడ ఉంటుంది కాబట్టి ఈ జాతి చేపల్ని ప్యారట్‌ఫిష్ అంటారు. కానీ దీని రంగుని బట్టి బ్లూ ప్యారట్‌ఫిష్ అని పేరు పెట్టారు.



* ఆహారం కోసం సముద్రంలో పగడపు దీవుల్లోని రాళ్లను పళ్లతో గీరడం వల్ల బోలెడంత ఇసుక తయారవుతుంది. ఇలా ఒకో చేప ఏడాదికి సుమారు 90 కిలోల ఇసుకను తయారుచేస్తుందని అంచనా. కొన్ని బీచ్‌ల్లో తెల్లగా కనిపించే ఇసుక వీటి వల్ల ఏర్పడినదే.
* మనకు ముద్దు పేర్లున్నట్టే వీటికి కూడా బ్లూ క్వాబ్స్, బ్లూ ప్యారట్స్, బ్లూమ్యాన్ అంటూ బోలెడు పేర్లున్నాయి.

* ఇవి ఎక్కువగా అట్లాంటిక్, కరిబీయన్ సముద్రాల్లో ఉంటాయి.

Saturday, 9 May 2015

అబ్బా.....అరచెయ్యంత అమీబా


అమీబా తెలుసుగా? సూక్ష్మదర్శినిలోకానీ చూడలేం... కానీ అరచెయ్యంత అమీబా బయటపడింది! ఎక్కడో తెలుసా?
అమీబా గురించి సైన్స్ పాఠాల్లో చదువుకుని ఉంటారు. అదొక ఏక కణ జీవి. సృష్టిలోని ఏ జీవి శరీరమైనా జీవకణాలతో నిర్మితమైందని తెలుసుగా? కానీ అమీబా మాత్రం అలాకాదు. దాని శరీరమంతా ఒక కణమే. అందుకే అది కంటికి కనిపించదు. సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడాలి. అలాంటిది అరచెయ్యంత పెద్దగా ఉండే అమీబాలను కనుగొన్నారు. ఎక్కడో తెలుసా? ఈ భూమ్మీదే అత్యంత లోతైన ప్రదేశంలో! ఒక జీవ కణాన్ని ఇంత పెద్దగా కనుగొనడం ఇదే తొలిసారి!


పసిఫిక్ సముద్రంలో మెరియానా ట్రెంచ్ అనే ఓ ప్రాంతం ఉంది. అది దాదాపు పదకొండు కిలోమీటర్ల లోతుగా ఉండే పెద్ద అగాథం. ఇది 2,550 కిలోమీటర్ల పొడవు, 69 కిలోమీటర్ల వెడల్పుంటుంది.అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని తీసుకెళ్లి అక్కడ పడేస్తే అది మొత్తం మునిగిపోతుంది. అలా మునిగిపోయాక కూడా దాని మీద 6000 అడుగులకు పైగా ఎత్తున నీరు ఉంటుంది. ఇక అక్కడి పరిస్థితులన్నీ చాలా చిత్రం. అంతా చిమ్మచీకటి. భరించలేనంత చలి. విపరీతమైన ఒత్తిడి. ఇక ఇక్కడి పీడనం సముద్రంపై ఉన్నదానికి వెయ్యింతలు అధికం. ఒక చదరపు అంగుళంపై 8 టన్నుల బరువును పెడితే ఎంత ఒత్తిడి కలుగుతుందో అంత! అంత ఒత్తిడిని కూడా తట్టుకుంటూ ఆ ప్రాంతంలో అరచెయ్యంత అమీబాలు అటూ ఇటూ తిరిగేస్తూ కనిపించి శాస్త్రవేత్తల్నే ఆశ్చర్యపరిచాయి. ఇవి ఒకోటీ 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నాయి. అంటే అరచేతి మీద పెట్టుకుని చూడచ్చన్నమాట. ఇంతవరకు కనుగొన్న ఏకకణ జీవుల్లో అతి పెద్దది ఇదేనని చెబుతున్నారు.

అమీబాల లక్షణాలే వింతగా ఉంటాయి. వీటికి ఒక రూపమంటూ ఉండదు. ఎలా కావాలంటే అలా రూపాన్ని మార్చగలవు. అందుకే రూపాలు మార్చే శక్తులున్న గ్రీకు దేవుడు పేరే దీనికి పెట్టారు. ఇవి భూమ్మీద అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. జీవుల శరీరాల్లో కూడా అమీబాలు నివసిస్తాయి.

కొత్తగా బయటపడ్డ పెద్ద అమీబాల్ని 'జెనోఫియోఫోర్స్' అని పిలుస్తున్నారు. ఇవి యురేనియం, లెడ్, మెర్క్యురీ లాంటి భారలోహాలను కూడా భోంచేయగలవని తేలింది. ఇంతకీ అంత లోతులో ఉండే వీటిని ఎలా కనుగొన్నారు? 'డ్రాప్‌కామ్'లనే ఆధునిక కెమేరాల సాయంతో. గాజు బుడ్డీలుగా కనిపించే వీటిలో లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో ఇవి తమంత తాముగా ఫొటోలు, వీడియోలు తీయగలవు. వీటిని ఆ అగాథంలో జారవిడిచి అవి తీసి పంపే ఫొటోలు, వీడియోలను పరిశీలించి పరిశోధన చేశారు.

గునియా పిగ్‌


* గునియా పిగ్‌లలో ఏడు జాతులుఉన్నాయి!
* దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లో కనిపిస్తాయి!
* ఇవి 25 సెంటీమీటర్ల పొడవు, ఒక కిలో బరువు పెరుగుతాయి!
* మగవాటినిత్న్చ్ీ, ఆడవాటిని ళ్నీ, పిల్లని శ్య్పిఅంటారు!
* ఇవి కళ్లు తెరిచే జన్మిస్తాయి! పేరులో పిగ్ ఉన్నా పంది జాతితో సంబంధం లేదు!
* వీటి గుండె నిముషానికి 240 నుంచి 350 సార్లు కొట్టుకుంటుంది!
* పుట్టిన 3 గంటలకే పరిగెత్తగలవు!

పెంగ్విన్




* పెంగ్విన్లలో 18 జాతులున్నాయి!
* అతి పెద్దదైన ఎంపరర్ జాతి మూడున్నర అడుగుల ఎత్తు, 35 కిలోల బరువుంటే, అతి చిన్నదైన బ్లూ పెంగ్విన్ 40 సెంటీమీటర్ల ఎత్తు, కేవలం కిలో బరువుంటుంది!
* పెంగ్విన్‌ల గుంపును రూకరీ (్్న్న్త్ఠ్్వ) అంటారు.
* ఇవి నుంచునే నిద్రిస్తాయి!
* ఎంపరర్ పెంగ్విన్లలో గుడ్లను పొదిగే బాధ్యత మగవాటిదే. గుడ్డును కాళ్ల మీద పెట్టుకుని మగవి రెండునెలల పాటు కదలక మెదలక, ఆహారం కూడా లేకుండా ఉంటాయి!
* పెంగ్విన్‌లు సముద్రంలో 20 నిముషాలపాటు ఊపిరి బిగపట్టి 1700 అడుగుల లోతుకెళ్లగలవు.



డాల్ఫిన్






రికార్డులు మార్చిన బుల్లికప్ప!


అడవిలోంచి వింత అరుపులు... దేనివో అంతుపట్టలేదు... శాస్త్రవేత్తలు బయల్దేరారు... కళ్లు చిట్లించుకుని గాలించారు... చివరకి కనిపెట్టారు! దేన్నో తెలుసా? ఓ బుల్లి కప్పని!




మీ స్కేలు తెచ్చుకోండి. అందులో 8 మిల్లీమీటర్లు ఎంతో చూడండి. అది మీ చిటికెన వేలు గోరుకన్నా చిన్నగానే ఉంటుంది కదా? అంత చిన్న స్థలంలో హాయిగా కూర్చునేంత బుల్లి కప్పను శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టారు. అసలిదంటూ భూమ్మీద ఉందని మనకెవరికీ ఇంతవరకూ తెలియదు. ఇప్పుడే బయటపడింది. ఏదో బుల్లి కప్పని తేలిగ్గా అనుకోకండి. బయటపడుతూనే ఇది కొన్ని రికార్డులను తిరగరాసింది. ఎలాగో తెలుసా? ఇది ప్రపంచంలోనే బుల్లి కప్పని తేలింది. అంతేనా? వెన్నెముక గల జీవుల్లో ఇదే అతి చిన్నదని కూడా గుర్తింపు పొందింది. ఇది కేవలం 7.7 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుందంతే. అంటే కంది బద్దంతో, బియ్యపు గింజంతో ఉంటుందన్నమాట!
పపువా న్యూగినాయా దేశంలోని దట్టమైన అడవుల్లో ఇది కనిపించింది. కప్పలపై పరిశోధన చేస్తున్న కొందరు శాస్త్రవేత్తలు అడవి నుంచి వెలువడే శబ్దాలను రికార్డు చేసి వాటిని జాగ్రత్తగా విన్నారు. ఆ శబ్దాల్లో తీవ్రస్థాయిలో ఉన్న అరుపులు కొన్ని వినిపించాయి. ఇవేంటో తెలుసుకోవాలని వెళ్లి గాలించారు. నేల మీద తడిగా ఉండే ప్రదేశాల్లో రాలిన ఆకుల కింద ఈ కప్పలు కనిపించాయి. భలేగున్నాయే అని పట్టుకోబోతే దొరికితేనా? గబుక్కున గెంతేస్తూ ఆటాడించాయి. ఆఖరికి ఎలాగైతేనేం, ఆకులన్నింటినీ ప్లాస్టిక్ సంచీలోకి ఎత్తేసి వెతికితే దొరికాయి.

వెన్నెముకగల జీవుల్లో అతి చిన్నదనే గుర్తింపు ఇన్నాళ్లూ ఓ చేపకి ఉండేది. కేవలం 7.9 మిల్లీమీటర్లున్న ఆ చేప రికార్డును ఇప్పుడీ బుల్లి కప్ప లాగేసుకుంది. ఇక కప్పల్లో ఇంతవరకు ఈ ఘనత ఒక సెంటీమీటరుండే బ్రెజిలియన్ గోల్డ్ ఫ్రాగ్‌కి ఉండేది.

Friday, 8 May 2015

తిమింగళాలు



తిమింగలం ముత్తాత్తాత!
కోరపళ్లు... కొనదేలిన నోరు... 20 అడుగుల పొడవు... ఇవన్నీ ఓ తిమింగలం తాతగారి విశేషాలు!

ప్రపంచంలోనే అతి పెద్ద జీవి ఏది? అనడిగితే తిమింగలం అని చెపుతారు. ఇప్పుడు ఈ తిమింగలం ముత్తాత్తాత ఆచూకీ దొరికింది. ఆయనగారి రూపమే విచిత్రం. మూతి నుంచి తోక దాకా 20 అడుగులే ఉన్నా ఆయనగారి దవడలే 60 అంగుళాల పొడవుగా ఉండేవి. నోరు తెరిచారంటే పైన, కింద కొనదేలిన కోర పళ్లే. కనిపించిన పెద్ద పెద్ద పెంగ్విన్లను, షార్కులను కరకరలాడించేసే వారు. ఇంతకీ ఈయనగారు ఈదులాడిన కాలం ఎప్పటిదో తెలుసా? దాదాపు 4 కోట్ల 90 లక్షల నాటిది! మరి అప్పట్లో ఆయన ఇలాగే ఉండేవారని ఎలా తెలుసు? పురాతన జంతువుల అవశేషాలు భూమి లోపల మార్పుల వల్ల శిలాజాలుగా మారతాయని తెలుసు కదా. అలా ఆయనగారి దవడ ఎముక శిలాజంగా మారింది. అది ఈమధ్యనే దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలో శాస్త్రవేత్తలకు దొరికింది. దాన్ని పరీక్షించి, దాని రూపం ఎలా ఉంటుందో ఊహించారన్నమాట. ఇంతవరకు మనకు దొరికిన తిమింగలాల శిలాజాల్లో ఇదే అతి ప్రాచీనమైనది. అందుకే ఇది తిమింగలం ముత్తాత్తాతని తేల్చారు.
ఇప్పుడంటే తిమింగలాలు కేవలం నీళ్లల్లో మాత్రమే ఉంటున్నాయి కానీ, ఒకప్పుడు ఇవి ఉభయచరజీవులు. అంటే కప్పల్లాగా నీటిలోనూ, భూమి మీద కూడా బతకగలిగేవి. ఎక్కువ శాతం ఆహారాన్ని ఒడ్డుకొచ్చే వెతుక్కునేవి. అలాంటి తిమింగలాలు పూర్తిగా జలచరాలుగా మారడానికి కనీసం కోటిన్నర ఏళ్లయినా పట్టి ఉంటుందని ఇంతవరకు అనుకునేవారు. కానీ ఈ ముత్తాత్తాతగారి దవడ శిలాజం మీద జరిగిన పరిశోధన వల్ల కేవలం 40 లక్షల కాలంలోనే ఈ మార్పు ఏర్పడిందని తెలుసుకున్నారు. అంతేకాదు ఈ శిలాజం పరిశీలన వల్ల కోట్లాది ఏళ్లనాటి వాతావరణ పరిస్థితులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి ముత్తాత్తాతగారు చాలా విషయాలే చెప్పారన్నమాట.

మీకు తెలుసా?
* ప్రపంచంలో సుమారు 85 జాతుల తిమింగలాలు ఉన్నాయి.
* వాటిల్లో అతి పెద్దది నీలి తిమింగలం. ఇది సుమారు వంద అడుగుల పొడవు, 181 టన్నుల బరువు పెరుగుతుంది. రోజుకి అయిదు టన్నుల ఆహారాన్ని తీసుకుంటుంది.
* అతి చిన్నది డ్వార్ఫ్‌స్పెర్మ్ తిమింగలం. ఇది 2.7 మీటర్ల పొడవు, 272 కిలోగ్రాముల బరువు పెరుగుతుంది

మొసళ్లు

తెలివైనది ఎలుగుబంటి




నక్క





సింహం

అనకొండ

తాంబేలు


* తాబేళ్లలో సుమారు 250 జాతులున్నాయి!
* అంటార్కిటికాలో తప్ప అన్ని ఖండాల్లో ఉంటాయి!
* పిల్లని Hatchling గుంపుని Bale అని పిలుస్తారు!
* వీటిల్లో నేలపై ఉండేవాటిని Tortoise అని, నీటిలో ఉండేవాటిని Turtles అని అంటారు.
* అతి పెద్దది గాలాపగస్ తాబేలు. ఇది 400 కిలోల బరువు, 5.9 అడుగుల పొడవు పెరుగుతుంది. 170 ఏళ్లు బతుకుతుంది. అతి చిన్నదైన స్పెకిల్డ్ కేప్ కేవలం 10 సెంటీమీటర్ల పొడవు, 160 గ్రాముల బరువుంటుంది!
* చెవులుండవు, కంపనాల ద్వారా ధ్వనిని పసిగడతాయి!
* వీటి డిప్ప 160 ఎముకల అనుసంధానంతో ఏర్పడుతుంది!
* కొన్ని జాతులు ఆహారం లేకుండా ఏడాదిపాటు బతగ్గలవు!
* సముద్రపు తాబేళ్లు గంటకు 50 కిలోమీటర్లు ఈదగలవు!

ఎలిఫెంట్ సీల్


* సీళ్లలో 33 జాతులున్నాయి!
* ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉంటాయి!
* పిల్లని శ్య్పి గుంపుని శ్న్టి అని అంటారు!
* అతిపెద్దదైన ఎలిఫెంట్ సీల్ 2500 కిలోల బరువు, 16 అడుగుల పొడవు పెరిగితే, అతి చిన్నదైన అడల్ట్ రింగ్‌డ్ సీల్ 50 కిలోల బరువు, నాలుగడుగుల పొడవు పెరుగుతుంది!
* ఆక్సిజన్‌ను నిల్వ ఉంచుకునే శక్తి ఉంది. రెండు గంటలపాటు నీళ్లలో వూపిరిబిగపట్టి ఉండగలవు!
* ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల సీళ్లు ఉన్నాయని అంచనా.
* వీటి పిల్లలు రోజుకు ఒకటిన్నర నుంచి రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి!

Loons

భూమిపై చీమ ఆక్రమణ!



ఎన్నో దేశాలకు తలనెప్పి... కోట్ల రూపాయల ఖర్చు... శాస్త్రవేత్తలకు సవాల్... దేనివల్లో తెలుసా?
ఓ చిన్న చీమ వల్ల!

చీమల పుట్టని చూసే ఉంటారు. కానీ ఏకంగా 6000 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన పుట్ట గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ దూరం భూమి వ్యాసార్థానికి ఇంచుమించు సమానం! అలాంటి పుట్టలు పెట్టే ఓ చీమ ప్రపంచానికే తలనెప్పిగా మారింది. తూర్పున జపాన్ నుంచి పశ్చిమాన అమెరికా వరకు ఆ చీమల సామ్రాజ్యం విస్తరించిపోయింది. అదే అర్జెంటైనా చీమ!
ఒక సెంటీమీటరంత కూడా ఉండని ఈ చీమలు ఆరు ఖండాల్లో దాదాపు 15 దేశాల్లో పెను సమస్యగా మారాయి. పక్షులు, తొండలపై కూడా దాడి చేసి చంపేసే ఇవి కోట్లాది రూపాయల ఖర్చుకు కారణమవుతున్నాయి.

కేవలం మూడు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఎదిగే ఇవి ఒకప్పుడు అర్జెంటీనాలోనే ఉండేవి. ఎలాగో మిగతా దేశాలకు చేరుకున్నాయి. అలా ఇవి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో విస్తరిస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రమాదకరంగా విస్తరించే జీవుల జాబితాలో వీటినీ చేర్చారు.

ఐరోపాలోని మెడిటేరియన్ సముద్ర తీరంలో ఏకంగా 6000 కిలోమీటర్ల మేర విస్తరించిన పుట్టల్ని కనుగొన్నారు. అలాగే కాలిఫోర్నియాలో 900 కిలోమీటర్ల పొడవునా వీటి పుట్టలు పెరిగిపోయాయి. ఇలా వందల కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించే ఇవి స్థానికంగా ఉండే జీవుల్ని, మొక్కల్ని తినేస్తున్నాయి. ఇతర చీమల పుట్టల్ని ఆక్రమిస్తున్నాయి.

సాధారణంగా ఒక పుట్టలోని చీమ మరో పుట్టలోకి చేరితే అవి దాడి చేస్తాయి. కానీ ఈ అర్జెంటైనా చీమలు వేర్వేరు దేశాలకు చెందినవైనా ఒకదాన్ని ఒకటి గుర్తించుకుంటాయి. అన్నీ కలిసి మరింత ఆక్రమణ చేస్తాయి. వేర్వేరు దేశాల్లోని ఈ చీమల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు వాటిలో రసాయనాలు, జన్యువుల పరంగా చాలా పోలికల్ని గమనించారు. అందుకే ఇవి కలిసికట్టుగా విస్తరించిపోతున్నాయని చెబుతున్నారు.

ఏ చీమ జాతుల్లోనైనా ఒకటే రాణి చీమ ఉంటే, అర్జెంటైనా చీమల్లో మాత్రం ప్రతి వెయ్యి కార్మిక చీమలకి దాదాపు 8 రాణి చీమలు ఉంటాయి. దాంతో వీటి సంఖ్యను అదుపు చేయడం కష్టమవుతోంది. ఒక రాణి చీమ, పది కార్మిక చీమలు కలిసి కొన్ని రోజుల్లో పెద్ద కాలనీనే సృష్టించగలవు. ఇళ్లలోకి కూడా చొరబడుతున్న వీటిని అదుపు చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

జిరాఫి



మీకు తెలుసా?
చి జిరాఫీల్లో మగవి దాదాపు 18 అడుగుల ఎత్తు పెరుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల జిరాఫీ ఆరడుగుల వరకు ఎత్తుంటుంది!
చి ఇవి రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్రిస్తాయి!

చి వీటిల్లో ఆరు జాతులున్నాయి. ఒక్కో దాని రంగు, చారల్లో కొద్దిగా తేడా ఉంటుంది.

చి రోజుకు దాదాపు 45 కిలోల ఆకులు, రెమ్మలు తింటాయి. రోజుకు 38 లీటర్ల నీరు తాగుతాయి. వెయ్యి కేజీలకుపైగా బరువు పెరుగుతాయి!
అవసరమైనపుడు కొది ్దదూరాలు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు!

చి జిరాఫీలు మెడలతో పోట్లాడుకుంటాయి. దీన్ని ఇంగ్లిషులో 'Necking' అంటారు.

చి దీని నాలుక 18 అంగుళాలు ఉంటుంది. పొడవైన నాలుకతోనే ముక్కును శుభ్రపరుచుకుంటుంది! చి ఎక్కువ రక్తపోటుగల జంతువు జిరాఫీనే.

పాండ





హార్న్‌డ్ లిజార్డ్ .... తొండ


మొత్తానికి అది భలే తొండ. ఆపద ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో దానికి బాగా తెలుసు. దాని దారిన అది అలా షికారు పోతుంటే, ఏ జంతువైనా దగ్గరికి వచ్చిందనుకోండి. మన తొండగారు ఏమీ కంగారు పడరు. మొదటి ప్రయత్నంగా పరిసరాలకు తగినట్లు శరీరం రంగును మార్చి కదలరు, మెదలరు. చాలా జంతువులు 'ఇక్కడేదో తొండలాంటిది ఉండాలే, ఎక్కడకు పోయింది చెప్మా?' అనోసారి అనుకుని వెళ్ళిపోతాయి. అయినా శత్రువు గుర్తుపట్టి ముందుకు వచ్చిందనుకోండి. ఇది శరీరాన్ని బాగా ఉబ్బించి బుస కొడుతుంది. అప్పుడిది మింగడానికి వీలు లేనంతగా పెరుగుతుంది. పైగా ఒంటి నిండా ముళ్ళలాంటి బొడిపెలు వస్తాయి. దాంతో చాలా జంతువులు 'మనకెందుకులే గొడవ' అని చక్కాపోతాయి. ఇంకా శత్రువు పట్టువదలక ముందుకు వచ్చేసిందనుకోండి. మన తొండగారి దగ్గర ఇంకో అస్త్రం ఉంది. ప్రపంచంలో దానికి మాత్రమే తెలిసిన విద్య మరి. అదేమిటో తెలుసా? ఉన్నట్టుండి దాని కళ్ళ కొనుకుల నుండి రక్తం బయటకు విరజిమ్ముకుని వస్తుంది. అది పిచికారీలాగా మీద పడేసరికి, ఏ శత్రువైనా కంగారు పడిపోవలసిందే.



ఇంతకీ దీన్ని ఏమని పిలుస్తారో తెలుసా? హార్న్‌డ్ లిజార్డ్. తల మీద రెండు చిన్న కొమ్ముల్లాంటి బొడిపెలు ఉంటాయి. అమెరికా, మెక్సికో పశ్చిమ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆపద సమయాల్లో తలలోని రక్త ప్రసరణాన్ని అధికం చేసుకోగలదిది. అప్పుడు నరాల్లో ఒత్తిడి పెరిగి కనుకొనుకులలోంచి రక్తపు బిందువులు దూసుకువస్తాయన్న మాట.

వానపాముకి వందనాలు!


కళ్లు, కాళ్లు, చేతులు, లేని జీవి... ప్రపంచానికే గొప్ప మేలు చేస్తోంది... భూతాపం నుంచి మనల్ని రక్షిస్తోంది... ఆ జీవి ఏంటోతెలుసా?వానపాము!



ఇన్నాళ్లకి మన గొప్పతనం తెలిసింది వీళ్లకి...!
వానపాము కనిపిస్తేనే చీదరించుకుంటారు చాలామంది. కానీ ఈసారి అది కనిపిస్తే వందనం చేయండి. ఈ మాటలు అంటున్నదెవరో కాదు శాస్త్రవేత్తలు. ఇవే గనుక భూమ్మీద లేకపోతే వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవని వారు చెబుతున్నారు. నాలుగేళ్లపాటు పరిశోధన చేశాక వాళ్లకి వానపాముల విలువేంటో తెలిసింది. వీటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలు ఏమిటో తెలుసా? వరదల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. కరువు పరిస్థితుల్ని నివారిస్తున్నాయి. భూతాపాన్ని ఆపుతున్నాయి. నేలను సారవంతం చేస్తూ ఆహారోత్పత్తిలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ పనులన్నింటినీ అవి దాదాపు 30 కోట్ల ఏళ్లుగా నిశ్శబ్దంగా చేస్తూ భూమికి మహోపకారం చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



శాస్త్రవేత్తలు రెండు పొలాల్ని ఎంచుకున్నారు. ఒక పొలంలో బోలెడన్ని వానపాముల్ని తీసుకొచ్చి వేశారు. మరొక పొలాన్ని మామూలుగానే దున్ని వదిలేశారు. కొన్ని రోజుల తరువాత ఆ పొలాల్లో నీటిని చిమ్మారు. వానపాములున్న పొలంలోని మట్టి పది రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకుంది. అవి ఉన్న నేలంతా మెత్తని స్పాంజిలాగా తయారైందన్నమాట. ఇలా అనేక రకాలుగా పరిశోధన చేశారు. భూమ్మీద వరదలు, కరువులు వాతావరణంలో మార్పుల వల్లనే కలుగుతాయి. వానపాములు ఉన్న భూములు ఎక్కువ నీటిని గ్రహించడం వల్ల వరదల ప్రభావం ఎంతగానో తగ్గిపోతుంది. అలాగే వర్షాలు పడని పరిస్థితిలో కూడా ఆ నేల లోపలి పొరల్లో ఎక్కువ తేమ ఉండడం వల్ల కరవు నివారణ అవుతుంది. పైగా ఇవి ఎండుటాకుల్లాంటి మొక్కల అవశేషాలను మంచి ఎరువుగా మారుస్తాయి. ఇవి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని గమనించారు.
మీకు తెలుసా?
* ప్రపంచంలో సుమారు 6000 రకాల వానపాములు ఉన్నాయి.
* ఒక ఎకరం నేలలో పది లక్షల దాకా వానపాములు ఉంటాయి.
* అతి పొడవైన వానపాము రికార్డు 22 అడుగులు. ఇది దక్షిణాఫ్రికాలో దొరికింది.
* వానపాములు పుట్టినప్పుడు బియ్యం గింజ కన్నా చిన్నగా ఉంటాయి.
* వీటి విసర్జితాలు మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాయి.

ప్లుటోమురస్ ఆర్టొబాలగనెన్సిస్ , అంటార్కిటిక్ మిడ్జ్


రండు చిన్న కీటకాలు... ప్రపంచ రికార్డులు సాధించాయి... అందరినీ ఆశ్చర్యంలో ముంచేశాయి... ఇంతకీ అవేంటీ? వాటి గొప్పేంటి?


ఒకటి భూమిలో 2 కిలోమీటర్ల లోతులో ఉంటుంది. మరోటి గడ్డకట్టుకుపోయే మంచులో చల్లగా బతికేస్తోంది. అయితే ఏంటీ గొప్ప? భూమ్మీదే అతిలోతైన ప్రదేశంలో, అతి చల్లటి వాతావారణంలో ఉండేవిగా ఇవి రికార్డు సాధించాయి. మరి వీటి విశేషాలు తెలుసుకుందామా?
అంతా చీకటే!

ఈకీటకం ఎక్కడుంటుందో తెలుసా? ప్రపంచంలోనే అతి లోతైన గుహలో. జార్జియా నల్లసముద్రం దగ్గరి కాకాసస్ పర్వతాల్లో ఉన్న క్రూబెరా బొరొంజా గుహలో. ఈ గుహ 7,188 అడుగుల(2,190 మీటర్లు) లోతు వరకూ ఉంటుంది. అంటే 2 కిలోమీటర్ల పైబడిన లోతన్నమాట! అక్కడ చిమ్మ చీకటి. ఆ భయంకరమైన ప్రాంతంలో ఈ కీటకం హాయిగా బతికేస్తోంది. భూమ్మీద ఇంత లోతులో బతికే జీవి ఇదేనని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గతంలో ఆ రికార్డు మెక్సికోలోని ఓ గుహలోపల ఉండే ఓ తేలుకు, సిల్వర్‌ఫిష్ అనే కీటకానికి ఉండేది.
ఇప్పుడు కనుగొన్న కీటకానికి అసలు కళ్లు కనిపించవు. రెక్కలు కూడా లేవు. ఆరుకాళ్లున్నాయి. పేరు ప్లుటోమురస్ ఆర్టొబాలగనెన్సిస్ (Plutomurus Ortobalaganensis). అంత పెద్ద పేరెందుకు గానీ గుడ్డి పురుగంటే సరిపోతుంది. అక్కడ ఉండే బూజు లాంటి పదార్థాన్ని తింటూ గుహలో గుట్టుగా బతికేస్తోంది. ఈ జాతికి చెందిన కీటకాలు లక్షల ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాయని తేలింది. దీన్ని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్నో నెలల కష్టపడ్డారు. తాళ్లేసుకుని గుహలోకి దిగి పరిశోధన చేసినప్పుడు ఇది బయటపడింది.

మంచులో మాణిక్యం!

దక్షిణ ధ్రువమైన అంటార్కిటిక్ ప్రాంతం చలికాలం వచ్చిందంటే మొత్తం గడ్డకట్టుకుపోతుంది. మంచులో నివసించే ఏ జంతువులూ ఆ చలిలో ఉండలేవు. మంచు గడ్డకిందుండే నీటిలోకి వెళ్లిపోతాయి. ఒక కీటకం మాత్రం మంచులో మాణిక్యంలా ఎంత చలినైనా తట్టుకుని బతికేస్తోంది. అదే అంటార్కిటిక్ మిడ్జ్. అందుకే భూమ్మీద అతి చల్లదనంలో బతికే జీవిగా ఇది రికార్డు కొట్టింది.
ఇది తన జీవితకాలంలో రెండేళ్లపాటు లార్వా దశలోనే ఉంటుంది. పెద్దయ్యాక కేవలం 10 నుంచి 14 రోజులు మాత్రమే బతుకుతుంది. ఆ సమయంలోనే గుడ్లు పెట్టి చనిపోతాయి. అసలు అంత చలిలో ఇవి ఎలా బతగ్గలుగుతున్నాయో తెలుసా? గడ్డకట్టుకుపోయి శరీరంలో 70 శాతం నీటిని కోల్పోయినా బతికే శక్తి దీనికుంది. ఈ విద్య మరే జీవికీ లేదు. అంటే ఇది చాలా మొండి కీటకమన్నమాట


యాంట్ ఈటర్


* చీమల్ని తినే యాంట్ ఈటర్లలో నాలుగు జాతులున్నాయి! 
* అతి పెద్దదైన జెయింట్ యాంట్ ఈటర్ ఆరడుగుల పొడవు, 40 కేజీల బరువుంటే, అతి చిన్నదైన సిల్కీ యాంట్ ఈటర్ కేవలం ఉడత అంత చిన్నగా ఉంటుంది!
* దక్షిణ అమెరికాలో ఉండే వీటి సంఖ్య 5000 అని అంచనా
* జెయింట్ యాంట్ ఈటర్ కీటకాలతో సహా, రోజుకు 35,000 చీమల్ని తినేస్తుంది!
* వీటి గుంపును శ్చ్చ్ట్ఠ్ి అని పిలుస్తారు!
* శత్రువులు దాడిచేసేప్పుడు వెనక కాళ్లపై నిల్చుని, ముందు కాళ్లతో పోరాడుతుంది. పులుల్ని కూడా ఎదురిస్తుంది!

spider