Thursday, 7 May 2015

బుల్లి వూసరవెల్లీ! భలే దానివే తల్లీ!!.....AMELION



\\\

బుల్లి వూసరవెల్లీ! భలే దానివే తల్లీ!!

అగ్గిపుల్లపై కూర్చోగలదు... చేతివేలిపై షికార్లు చేయగలదు... ఇది కొత్తగా కనుగొన్న అతి చిన్న ఊసరవెల్లి!


శరీరం రంగులు మార్చుకునే ఊసరవెల్లి తెలుసుగా? వీటిలో అతి బుల్లిది బయటపడింది. కొలిచి చూసేసరికి ఇది ప్రపంచంలోనే చిన్నదని తేలిపోయింది. నేలపై పాకే జీవుల్ని సరీసృపాలు అంటారు కదా! వాటిలో అతి బుల్లిది కూడా ఇదే. దీన్ని ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ దీవుల్లోని దట్టమైన అడవుల్లో కనుగొన్నారు. ఇది ఎంత చిన్నదంటే ఓ అగ్గిపుల్లపై చక్కగా నుంచోగలదు. బొటన వేలు గోరుపై పాకగలదు. మూతి నుంచి తోక వరకు కేవలం 24 మిల్లీమీటర్ల పొడవుందంతే! దీనికి బ్రుకుసియా మిక్రా అని పేరు పెట్టారు. దీనితో పాటు మరో మూడు కొత్త ఊసరవెల్లుల్ని కనుగొన్నారు.
కొత్త జీవుల కోసం శాస్త్రవేత్తలు నిత్యం అడవుల్లో, నదుల్లో, సముద్రాల్లో పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అలా జర్మనీ, అమెరికాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం మడగాస్కర్ అడవులకు వెళ్లింది. చాలా జంతువులు ఉదయం పడుకుని రాత్రి వేళల్లో ఆహారాన్ని వెతుక్కోవడం కోసం బయటకు వస్తుంటాయి. అలాంటప్పుడు కూడా కొత్త జీవుల్ని కనుక్కోవచ్చన్న ఉద్దేశంతో కొంతమంది శాస్త్రవేత్తలు లాంతర్లు పట్టుకుని అడవుల్లోకి వెళ్లారు. అణువణువును శోధించారు. అప్పుడే దీనిని కనిపెట్టారు. ఉదయమంతా రాలిపోయిన ఆకుల గుట్టల్లో దాక్కుని ఉండే ఇది రాత్రయ్యే సరికి మాత్రం చెట్టు కొమ్మల మీదకి ఎక్కి పడుకుంటుంది.


       


సరవెల్లి అనగానే మొదట గుర్తొచ్చేది శరీరంపై రంగులు మార్చే లక్షణమే కదా? అయితే ఈ బుల్లి ఊసరవెల్లికి మాత్రం అసలు ఆ లక్షణమే లేదు. ఎప్పుడూ మట్టిరంగులోనే ఉంటుంది. ఇది ఎన్నో వేల ఏళ్ల క్రితమే రంగులు మార్చే గుణాన్ని కోల్పోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చి ప్రపంచంలోనే అతి పెద్ద ఊసరవెల్లి మడగాస్కర్ అడువుల్లోనే ఉండే పార్సన్స్ ఊసరెవెల్లి. ఇది 68 సెం.మీ పొడవుతో పిల్లి పరిమాణంలో ఉంటుంది.

వూసరవెల్లి 
రంగుల రహస్యం!

వూసర వెల్లి రంగు మారుస్తుందని తెలుసు... మరి దానికి కారణం ఏంటీ? ఈ మధ్యే రంగుల రహస్యం తెలిసింది! ఆ సంగతులు చదివేద్దామా?


అప్పుడే ఆకుపచ్చ రంగులో ఉన్న వూసరవెల్లి, కాసేపటికి శరీరాన్ని ఎరుపు రంగు చేసేస్తుంది. ఆ తర్వాత నీలం రంగులోకి మారుతుంది. ఇలా ఇది రకరకాల రంగుల్ని మార్చడం ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! అసలు వూసరవెల్లికి ఈ కళ ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆరాతీశారు పరిశోధకులు. చివరికి ప్రయోగం ఫలించి దీని రంగు రహస్యం తెలిసింది.
చి వూసర వెల్లి శరీరంలోపలి చర్మం కణాల చుట్టూ అతి సూక్ష్మమైన స్ఫటికాల్లాంటి అద్దాలు ఉంటాయిట. అవే రంగు మారడానికి కారణమట. ఈ స్ఫటికాలను శాస్త్రీయంగా 'ఇరిడోఫోర్స్' అంటారు. వూసరవెల్లి విశ్రాంతిగా ఉన్నప్పుడు అంటే శరీరం ముడుచుకున్నప్పుడు ఈ స్ఫటికాలు దగ్గరగా ఉంటాయి. ఇక ఈ బల్లులు కాస్త ఒత్తిడికి గురైనపుడు ఇరిడోఫోర్స్ దూరంగా జరుగుతాయి. ఇవి దగ్గరగా ఉన్నపుడు నీలం, ఆకుపచ్చ రంగులు ఏర్పడతాయి. స్ఫటికాలు దూరం జరిగితే పసుపు, కాషాయం, ఎరుపు రంగు ఛాయలు శరీరంపై క్రమంగా వస్తుంటాయని తేల్చారు.

* స్ఫటికాలు దగ్గరగా ఉంటే తక్కువ తరంగధైర్ఘ్యం (వేవ్ లెంత్)గల రంగులు, దూరం జరిగితే ఎక్కువ తరంగధైర్ఘ్యం గల వర్ణాలు ఏర్పడతాయి.

* స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను మడగాస్కర్ అడవుల్లో ఉండే 'పాంథర్ కమీలియన్' పై చేశారు.

* ఇన్నాళ్లూ వూసరవెల్లి రంగులు మార్చడానికి వేరే కారణాలు ఉన్నాయని అనుకునేవారు. ఈ జీవి శరీరంలోపల ఉండే పిగ్మెంట్స్ (వర్ణ ద్రవ్యకాలు) వల్లే వివిధ రంగులు ఏర్పడతాయని భావించారు. కానీ ఇప్పుడు సూక్ష్మ స్ఫటికాలైన 'ఇరిడోఫోర్స్' ప్రభావం వల్లే వీటి శరీరంలోని రంగుల్లో మార్పులు వస్తాయని తెలిసింది. అంతేకాదు వూసరవెల్లి శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో కూడా ఈ సూక్ష్మ స్ఫటికాలే ఎంతో ఉపయోగపడతాయిట.

* ఇంతకీ వూసరవెల్లి రంగు రహస్యం తెలుసుకోవడం వల్ల లాభమేంటీ అంటారా? దీనిపై పరిశోధనలు చేసి రంగులు మారే దుస్తులు, ఇంకా కొన్ని వస్తువులు తయారుచేస్తారట.
మీకు తెలుసా?
* బల్లి కుటుంబానికి చెందిన వూసరవెల్లుల్లో దాదాపు 160 జాతులు ఉన్నాయి!
* ఈ బల్లులు 20 సెకన్లలో రంగును మార్చగలవు!
* ఇవి ఒకేసారి రెండు దిక్కులకు చూడగలవు!
*  వీటి నాలుక శరీరానికన్నా రెండింతల పొడవుంటుంది!

No comments:

Post a Comment