డైనోసార్లలో రారాజు... దాని సత్తా 'జురాసిక్ పార్క్'లో చూశాం...ఆ సినిమా వచ్చి 20 ఏళ్లయింది... ఇప్పుడది త్రీడీలో రాబోతోంది... మరి అప్పటికి ఇప్పటికి... ఆ డైనోసార్ కొత్త సంగతులేంటి?

కొండలాంటి భారీ శరీరం... భయం గొలిపే పళ్లు... అది వస్తోందంటేనే మిగతా జంతువులన్నీ గడగడా వణికిపోయేవి... డైనోసార్లు అన్నింటిలోకీ అతి భయంకరంగా వేటాడే జీవిగా పేరొందిన టిరనోసారస్ రెక్స్ వివరాలివి. 'జురాసిక్ పార్క్' సినిమాలో అది సృష్టించిన బీభత్సాన్ని ఓసారి గుర్తు చేసుకోండి. మనుషుల్ని నోటితో పట్టుకుని పైకి విసిరి పట్టుకుని అమాంతం మింగేయడం, జీపు వెంట పరుగులు తీస్తూ వేటాడ్డం లాంటి దృశ్యాలను ఆశ్చర్యంతో చూసి ఉంటారు. ఆ సినిమా వచ్చిన ఈ 20 ఏళ్లలో ఈ భారీ డైనోపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో తేలిందేమిటో తెలుసా? ఇవి ఆ సినిమాలో చూపించినదాని కన్నా మరింత భయంకరమైనవని!
ఎప్పుడో కోట్లాది ఏళ్ల క్రితం భూమ్మీద బతికిన డైనోసార్ల గురించి ఇప్పుడు మనకెన్నో వివరాలు తెలుసు. భూమిలో దొరికిన వాటి అవశేషాల శిలాజాలను బట్టి ఇవి దాదాపు వెయ్యికి పైగా జాతులుగా ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా తెలిసిన డైనోసార్లన్నింటిలోకీ ఎక్కువ పొడవైన, కొనదేలిన పళ్లు దేనివో తెలుసా? టిరనోసారస్ రెక్స్‌వే! ఇలాంటి పళ్లున్న నోటితో ఇది 55 కేజీల బరువుండే జంతువును కూడా గాల్లో 15 అడుగుల పైకి ఎగరేసి మళ్లీ పట్టుకుని కరకరలాడించేసేవని బయటపడింది. ఇవి ఏకంగా 12,800 పౌండ్ల శక్తితో కొరకగలిగేవని లెక్క కట్టారు. ఇది ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ క్రూరజంతువు కన్నా 13,000 రెట్లు ఎక్కువ! వీటికి ఒకదానితో ఒకటి కూడా భయానకంగా పోరాడుకునేవి.
ఇంతటి బలమైన డైనోసార్లు కూడా కొన్ని సూక్ష్మజీవుల వల్ల చనిపోయాయని తేలింది. సూక్ష్మజీవుల బారిన పడిన పక్షుల్ని తినడం వల్ల ఇవి కూడా రోగాలకు గురయ్యాయని తెలిసింది. ఇవి గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేవి. నడక వేగం గంటకు 9 కిలోమీటర్లు ఉండేది.
మీకు తెలుసా?
* టిరనోసారస్ రెక్స్‌లు ఏకంగా 42 అడుగుల పొడవు, 7000 కిలోల బరువుండేవి!
* వీటి తల పొడవే 5 అడుగులు ఉండేది!
* ఇవి భూమిపై సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం బతికాయి!
* వీటి ఒక్కో పన్నూ 12 అంగుళాల పొడవుండేది.
* 14 నుంచి 18 వయసులో వీటిలో పెరుగుదల ఎక్కువగా ఉండేది. ఏడాదికి 600 కేజీల చొప్పున బరువు పెరిగేవి!
* వీటి తల పొడవే 5 అడుగులు ఉండేది!
* ఇవి భూమిపై సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం బతికాయి!
* వీటి ఒక్కో పన్నూ 12 అంగుళాల పొడవుండేది.
* 14 నుంచి 18 వయసులో వీటిలో పెరుగుదల ఎక్కువగా ఉండేది. ఏడాదికి 600 కేజీల చొప్పున బరువు పెరిగేవి!
No comments:
Post a Comment