ఓ తాత... ఓ మనవడు... కొత్తగా ప్రపంచానికి పరిచయమయ్యారు... వాళ్లెవరో తెలుసా? డైనోసార్లు! వాళ్ల సంగతులేంటో... వాళ్ల మాటల్లోనే విందామా!
తాత: ఏరా మనవడా! చూడ్డానికి భారీ కొమ్ములతో భలే ఉన్నావ్! నీ సంగతులేంటో చెప్పు...
మనవడు: అది సరేగానీ... నువ్వు నాకు తాతవా?అదెలా?
తాత: నీకన్నా ముందు కాలం వాడినిరా! నేను 95 కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ప్రాంతంలో తిరగాడాను...
మనవడు: ఓ... ఆ లెక్కలో చెబుతున్నావా? అయితే సరేలే! నీ తర్వాత పదిహేను కోట్ల ఏళ్లు గడిచాక నేను కెనడా ప్రాంతంలో తిరిగేవాడిని. మొత్తం మీద మనమిద్దరి గురించి ఒకేసారి వార్తలు రావడం వింతగా ఉంది. ముందు నీ గురించి చెప్పు తాతయ్యా!
తాత: నాకు 'సౌరన్' (Sauron) అని పేరు పెట్టార్రా శాస్త్రవేత్తలు. ఒకప్పుడు భూమ్మీద తిరిగిన అతి పెద్ద డైనోసార్లలో నేనూ ఒకడినని లెక్క తేల్చారు. మన రాకాసిబల్లుల్లో ఇంత వరకు 'టిరనోసారస్ రెక్స్' అనేదే పెద్దదని అనుకునేవారు. ఇప్పుడు నేను కూడా అంత పొడవుగా ఏకంగా 40 అడుగుల భారీ శరీరంతో ఉండేవాడినని కనిపెట్టారు. ఏడున్నర వేల కిలోలకు పైగానే బరువుగా ఉండేవాడిని. నేను ధనా... ధనా... నడుస్తుంటే నేల దద్దరిల్లేదనుకో. నన్ను చూసి చిన్నా చితకా డైనోలన్నీ పరుగో పరుగు.
మనవడు: అబ్బో... బాగా దౌర్జన్యంగానే బతికావన్నమాట. నాకంత సీన్ లేదులే. నాకు 'జెనోసిరాటాప్స్' (Xenoceratops) అని పేరు పెట్టారు వీళ్లు. ఇప్పుడున్న ఖడ్గమృగాలంత పెద్దగా ఉండేవాళ్లం. నా ప్రత్యేకత నా కొమ్ములే. చూస్తున్నావుగా... తల మీద, ముఖం మీద వేర్వేరు పరిమాణాల్లో ఎలా ఉన్నాయో! తల నుంచి తోక వరకు 20 అడుగుల పొడవుగా ఉండే నేను రెండు వేల కిలోల బరువు ఉండేవాణ్ని. ఇప్పటి వరకూ బయటపడ్డ డైనోల్లో నేనే అరుదైన కొమ్ములున్న వాడినని చెబుతున్నారు. ఇంతకీ నీ కాలంలో నువ్వేం తినేవాడివి తాతా?

తాత: మొత్తానికి నువ్వు కొమ్ములు తిరిగిన వాడివన్నమాట. మాకప్పట్లో ఎటు చూసినా తిండేరా. నా ముఖం ఎంత పొడవో చూశావుగా? నోట్లో కత్తుల్లాంటి కోరలు డజన్ల కొద్దీ ఉండేవి. వాటి సాయంతో ఏది దొరికితే దాన్ని వేటాడ్డం, పీక్కు తినడం ఇదే మా పని. మరి నీ సమయానికి ఆహారం సరిపోయేదా?
మనవడు: అమ్మో! నీ తిండి సంగతి వింటుంటేనే భయంగా ఉంది. నేను మాత్రం అలా కాదులే తాతా! నా నోరు చూస్తున్నావుగా, పక్షి ముక్కులా లేదూ? దాంతో ఏదో ఆకులు, అలములు, పళ్లు, కీటకాల్లాంటివి పట్టుకుని తింటూ ఉండేవాడిని. ఒక విధంగా నువ్వు మాంసాహారివైతే, నేను దాదాపు శాకాహారిననుకో!
No comments:
Post a Comment