అవి కాళ్లున్న పాములు... డైనోసార్లను కూడా తినే శక్తి వాటిది... వింతగా అనిపిస్తుందా?అయితే వాటి సంగతులు చదవండి!
బల్లులకు, తొండలకు కాళ్లుంటాయని తెలుసు. మరి పాములుకూ కాళ్లు ఉండేవని తెలుసా? వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ కొన్ని కోట్ల ఏళ్ల కిందట ఇలాంటి పాములు ఉండేవని కొత్తగా తెలిసింది.
చి ఎప్పుడో అంతరించిపోయిన జీవుల సంగతులు భూమిలో దొరికే వాటి శిలాజాలను బట్టి మనకు తెలుస్తాయి. అలా కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే ఎప్పుడూ చూడని విధంగా వింతగా ఉన్న కొన్ని శిలాజాలు దొరికాయి. వాటిని పూర్తిగా పరిశీలిస్తే అవి పాములవని తేలింది. పైగా ఇప్పటి వరకు దొరికిన పాముల శిలాజాల కన్నా ఇవి అతి ప్రాచీనమైనవని కనుగొన్నారు.
* అప్పటి ఈ పాములకు కాళ్లు కూడా ఉండేవని తెలుస్తోంది. అంటే... వాటి రూపం ఇప్పుడున్న పాముల్లానే ఉన్నా ముందు, వెనుకా చిన్న చిన్న కాళ్లు ఉండేవి. అంటే ఇప్పటి బల్లి, బిందుపాములకు ఉన్నట్టన్నమాట.
* ఇప్పటివరకు మనకు దొరికిన సర్పాల శిలాజాలన్నీ కోటి సంవత్సరాల క్రితం నాటివే. కానీ ఇప్పుడు బయటపడ్డ వాటిలో ఏకంగా 16 కోట్ల 60 లక్షల ఏళ్ల నాటివి ఉన్నాయి.
* ఆల్‌బర్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో మొత్తం నాలుగు జాతుల పాముల శిలాజాలు దొరికాయి. ఒకటి 16.7 కోట్ల ఏళ్ల నాటిది. ఇంగ్లండ్‌లో బయటపడింది. ఇయోఫిస్ అని పేరు పెట్టారు. పది అంగుళాల పొడవుండేది. చిత్తడి నేలల్లో తిరిగాడుతూ చిన్న చిన్న పురుగులు తిని బతికేదిట.
* రెండోది దాదాపు నాలుగు అడుగుల పొడవుండేది. దీని పేరు పోర్చుగలోఫిస్. పోర్చుగల్‌లో బయటపడింది. సుమారు 15 కోట్ల 50 లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరిగాడిన ఈ పాము ఏకంగా పిల్ల డైనోలను, బల్లుల్ని, పక్షుల్ని, కప్పల్ని ఆంఫట్ అనిపించేదిట.
* మూడోది డైబ్లోఫిస్ గిల్మోరై. 15 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఈ పాము శిలాజాలు కొలరోడాలో దొరికాయి.
* నాలుగో పాము అవశేషాలు ఇంగ్లండ్‌లోని సముద్రతీర ప్రాంతాల్లో బయటపడ్డాయి. సుమారు 14 కోట్ల ఏళ్ల క్రితం నాటి దీని పేరు పర్విరాప్టర్ ఎస్టెసి.
* ఈ పాముల పుర్రె, శిలాజాల్ని బట్టి వీటి ఆకృతి ఇప్పుడున్న పాముల్ని పోలి ఉన్నా కొన్ని లక్షణాలు మాత్రం భిన్నంగా ఉండేవని తెలిసింది. నిజానికి పాములు బల్లుల పరిణామ క్రమం నుంచే వచ్చాయి. నెమ్మదిగా కాళ్లను పోగొట్టుకుని మనం చూస్తున్న పాముల్లా మారిపోయాయన్నమాట.
మీకు తెలుసా?
* ప్రపంచవ్యాప్తంగా 3000 పాము జాతులున్నాయి.
* ఇప్పుడున్న పాముల్లో అతి పొడవైనది ' రెటిక్యులేటెడ్ ఫైథాన్' ఇది దాదాపు 20 అడుగులకుపైగా పెరుగుతుంది!

పాములకు పితామహుడు..
ఇప్పుడు మనం చూస్తున్న పాముల పూర్వీకులకు కాళ్లుండేవా? ఇవి కూడా జంతువుల మాదిరి వేటాడేవా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వేటాడే పాముల నుంచి ఇప్పుడున్న దాదాపు 3 వేలకు పైగా పాము జాతులు ఉద్భవించాయని తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. అవి వాటికున్న హుక్ లాంటి పళ్లను ఉపయోగించి వేటాడేవని చెబుతున్నారు. | |
వీటికి వెనుక కాళ్లకు బొటనవేలు, మడమలు ఉండేవని, కాకపోతే అవి కదిలేందుకు సహకరించి ఉండకపోవచ్చని అంటున్నారు. దాదాపు 73 సర్ప జాతుల శిలాజాలు, జన్యు క్రమం, శరీర నిర్మాణాలను పోల్చి చూశాక యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాదాపు 12.85 కోట్ల సంవత్సరాల కింద ఈ పాము జాతులదే హవా అట! |
* ప్రపంచవ్యాప్తంగా 3000 పాము జాతులున్నాయి.
* ఇప్పుడున్న పాముల్లో అతి పొడవైనది ' రెటిక్యులేటెడ్ ఫైథాన్' ఇది దాదాపు 20 అడుగులకుపైగా పెరుగుతుంది!
No comments:
Post a Comment