
జూలు ఏనుగు (ఊల్ మామత్)లు, ఇతర పెద్ద జంతువులు... ఎలా అంతరించి పోయాయి? అనే ప్రశ్నకు,వాతావరణ మార్పులు అనే జవాబు సిద్ధంగా ఉండేది. నాలుగు వేల సంవత్సరాల క్రితం సైబీరియాలో అంతరించి పోయాయి మామత్లు వాతావరణ మార్పుల వల్ల కాకుండా వేటగాళ్ల వల్లే అవి అంతరించిపోయాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
మెరుగైన ఆయుధసంపత్తి లేని ఆ కాలంలో అంత పెద్ద జంతువులను ఎలా వేటాడారు? అనే సందేహం రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మామత్ లాంటి పెద్ద జంతువులను చంపడానికి అసాధారణమైన ఆయుధాలేవి వేటగాళ్లు వాడలేదు. పెంపుడు కుక్కల సహకారాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకునేవారు.
ముందుగా కుక్కలన్నీ మామత్ను చుట్టుముట్టేవి. అది కదలడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేటగాళ్లు వచ్చి దాడి చేసేవాళ్లు అంటున్నాడు డెన్మార్క్ కు చెందిన ఆంత్రోపాలజిస్ట్ పాట్ షిప్
గత సంవత్సరం విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం... ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యూరప్లో శునకాలు పెంపుడు జంతువులుగా ఉండేవి. వాటిని ప్రధానంగా వేటకు వాడుకునేవారు. అన్నట్టు మామత్ ఎముకలతో వేటగాళ్లు ఇండ్లను కూడా నిర్మించుకునేవారు. మొత్తం మీద జూలు ఏనుగులు అంతరించిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చుగాక, ప్రధానకారణం మాత్రం వేటగాళ్లే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన గ్లెన్ మెక్ డోనాల్డ్ అనే పరిశోధకుడు.
ఆనాటి నుంచి ఈనాటివరకు ఎన్నోరకాల మార్పులు వచ్చాయి. మనుషుల నుంచి జీవజాతులకు ఏర్పడుతున్న ముప్పు విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. పెపైచ్చు ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగింది అని ఆవేదన చెందుతున్నాడు మెన్ డొనాల్డ్
నిజమే కదా మరి

ఆ జంతువులు ఇప్పుడు లేవు... ఎప్పుడో అంతరించి పోయాయి... కానీ అవి మళ్లీ పుడితే? మన కళ్ల ముందుకు వస్తే? ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి! ఎలాగో చూద్దామా?
వూలీ మమోత్. ఒళ్లంతా జడలతో ఉండే ఏనుగు. పది వేల ఏళ్ల కిత్రం అంతరించి
పోయింది. దాదాపు 15 అడుగుల ఎత్తున 15 టన్నుల బరువుంటుంది
జడల ఏనుగు వూలీ మమోత్... పులి చారల జంతువు టాస్మానియన్ టైగర్... ఎగరలేని పక్షి మోవా... నేల మీద నడిచే స్లాత్...
-ఈ జంతువుల పేర్లు ఎప్పుడైనా విన్నారా? చాలా అరుదుగానే విని ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు లేవు. వేల ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. కానీ వాటిని తిరిగి పుట్టించ వచ్చంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిని 'డీ ఎక్‌స్టింషన్' (De-extintion) అని, 'రిసరక్షన్' (Resurrection) అని పిలుస్తున్నారు.
ఏ జీవి శరీరమైనా కణాలతో ఏర్పడిందని, ఆ కణాల కేంద్రంలో జన్యుపదార్థం (డీఎన్ఏ) ఉంటుందని చదువుకుని ఉంటారు. దాని సాయంతో 'క్లోనింగ్' ప్రక్రియ ద్వారా ఒక జంతువు నుంచి అచ్చం దానిలాగే ఉండే మరో జంతువును సృష్టించవచ్చని తెలిసిందే. ఇలా ఇప్పటికే కొన్ని జంతువుల్ని పుట్టించారు. అయితే ఇప్పుడున్న జంతువుల నుంచి పుట్టించడం వేరు, అంతరించిపోయిన వాటి నుంచి పుట్టించడం వేరు. అలా చేయాలంటే వాటి శరీరంలో ఉండే డీఎన్ఏ పాడవకుండా దొరకాలి.

ఈ ఆలోచనలకు ఎప్పుడో 10 వేల ఏళ్ల క్రితం మంచు యుగంలో తిరగాడిన జడల ఏనుగు 'వూలీ మమోత్' నాంది పలికింది. వీటి అవశేషాలు కొన్ని మంచులో కూరుకుపోయి కనిపించాయి. మంచు వల్ల పాడవని వాటిలో ఉన్న డీఎన్ఏ ద్వారా ఇప్పటి మామూలు ఏనుగుకు దాన్ని మళ్లీ పుట్టించవచ్చని చెబుతున్నారు. ఇలాగే మరి కొన్ని జంతువులను కొన్నేళ్లలో కళ్ల ముందుకు తీసుకు వస్తామంటున్నారు.
అయితే 'జురాసిక్ పార్క్' సినిమాలోలాగా డైనోసార్లను మళ్లీ బతికించవచ్చా? అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కోట్ల ఏళ్ల క్రితం నాటి వాటి శిలాజాల్లో జీవ పదార్థం ఏదీ ఉండదు.
No comments:
Post a Comment