అవి ఉన్నప్పుడు మనం లేం... చూద్దామంటే ఇప్పుడవి లేవు... అవే డైనోసార్లు! వీటి గురించి కొత్త సంగతి తెలిసింది... అదేంటో తెలుసా? వాటన్నింటికీ ముత్తాతగారు దొరికారు!
డైనోసార్ల బొమ్మలు దొరికితే దాచుకుంటాం. వాటిపై సినిమాలు వస్తే చూసేస్తాం. ఇప్పుడు వాటికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. అదేంటో తెలుసా? ఇప్పటి వరకు మనం వూహించిన దానికంటే చాలా ముందుగానే ఈ భూమ్మీద డైనోసార్లు తిరిగాయని. అందుకు సాక్ష్యం కొత్తగా బయటపడింది. పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది డైనోసార్లందరికీ ముత్తాతగారిది. అంటే ఇంత వరకు మనకి తెలిసిన డైనోసార్ల కంటే చాలా పాతది!
అసలింతకీ డైనోసార్లంటూ ఒకప్పుడు భూమ్మీద బతికేవని మనకెలా తెలిసింది? భూమిని తవ్వడం వల్లనే. మనుషులెవరూ ఏర్పడక ముందు ఉండే చెట్లు, జీవుల అవశేషాలు భూమి పొరల్లో మార్పులకు గురై శిలాజాలుగా మారతాయని తెలుసుగా? వాటిని పరిశీలించడం ద్వారానే మనకి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలా డైనోసార్ల గురించి పరిశోధన చేసేవారిని 'పాలియాంటాలజిస్ట్'లంటారు. వాళ్లే డైనోసార్ల శిలాజాలను పరిశీలించి వాటి రూపాన్ని వూహించి నమూనాలుగా తయారు చేస్తారు.
ఇప్పటి వరకు మనకి తెలిసి డైనోసార్లు ఈ భూమిపై సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. అంటే 23 కోట్ల సంవత్సరాల కిత్రమన్నమాట. అంటే అంత పాత డైనోసార్ తాలూకు శిలాజాలు కూడా మనకి దొరికాయనే అర్థం. దక్షిణ అమెరికాలో దొరికిన ఓ డైనోసార్‌నే ఇంతవరకు అతి పాతదనుకునేవారు. కానీ ఇప్పుడు దాని ముత్తాత దొరికాడు. ఈయనగారి వయసెంతో తెలుసా? డైనోసార్లన్నింటి కంటే పదిహేను మిలియన్ సంవత్సరాలకు పైబడే. అంటే కోటిన్నర ఏళ్లు ఎక్కువన్నమాట. ఈ తాతగారికి 'న్యాసా సారస్' అని పేరు పెట్టారు.
నిజానికి పాపం ఈ ముత్తాతగారు 1930లోనే బయటపడ్డారు. అప్పట్లో టాంజానియాలో ఒక చెయ్యి, కొన్ని వెన్నెముక శిలాజాలు బయటపడ్డాయి. అప్పట్లో సరైన సాంకేతిక పరికరాలు లేక పరిశోధన చేయలేదు. ఈ మధ్య కొందరు శాస్త్రవేత్తలు ఆధునిక పరికరాల సాయంతో పరిశీలించి వివరాలు కనుగొన్నారు.
ఇంతకీ ఈ ముత్తాతగారి రూపం ఏమిటి? ఇది సుమారు ఆరున్నర అడుగుల నుంచి పదడుగుల పొడవుగా ఉండేదని తెలుసుకున్నారు. కానీ పుర్రె ఎముకలేవీ బయటపడలేదు. కాబట్టి ఆయనగారు ఏం తినేవారో, ఎన్ని కాళ్లపై నడిచేవారో లాంటి వివరాలు తెలియలేదు.

No comments:
Post a Comment