ప్రేమికులు మనుషుల్లోనేనా? డైనోసార్లలో కూడా ఉన్నాయట... ఈ మధ్యే ఆ డైనో ప్రేమ జంట బయటపడింది... వాటికి శాస్త్రవేత్తలు రోమియో జూలియట్ అని పేరు పెట్టారు!
ఒకే పరిమాణం. ఒకే రూపం. ఒకే వయసు. దాదాపు అన్నీ ఒకేలా ఉన్న రెండు డైనోల శిలాజాలు ఒకే దగ్గర దొరికాయి. వీటి గుట్టు రట్టు చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆసక్తికరమైన కొత్త సంగతి తెలుసుకున్నారు. అదేంటో తెలుసా? అవి ప్రేమికులని!
* ఇవి కొన్ని కోట్ల ఏళ్లుగా ఒకే సమాధిలో ఉండిపోయాయి. ప్రముఖ రచయిత షేక్‌స్పియర్ నాటకంలోని ప్రేమికుల జంట రోమియో, జూలియట్‌ల జీవితం కూడా ఇలానే ముగుస్తుంది కదా? ఆ పోలిక వల్ల వీటికి కూడా ఈ పాత్రల పేర్లు పెట్టారు.
* మంగోలియాలోని గోబి ఎడారిలో ఇసుక మేటల కింద ఈ డైనో శిలాజాలు 2001లో దొరికాయి. వివరాలు మాత్రం తెలియలేదు. ఇన్ని సంవత్సరాలుగా పరిశోధన చేస్తే ఈ మధ్యే అవి ఒకే జాతికి చెందిన ఆడ, మగ పక్షులని తేలింది.
* అసలు డైనోసార్లలో ఆడ, మగను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే లక్షలాది ఏళ్ల క్రితం నుంచి భూమిలో ఉండే వీటి ఎముకల శిలాజాలను పరిశీలించి ఆడవా, మగవా అనేది కచ్చితంగా చెప్పలేరట. మరి ఈ డైనోల్లో ఏది రోమియోనో, ఏది జూలియటో ఎలా తెలిసిందంటే, వీటి ఎముకల సైజునుబట్టి కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న డైనో మగ అని, తోక భాగం చిన్నగా ఉన్నది ఆడ అని తేల్చారు.
* ఈ డైనోలను థెరాపాడ్స్ అంటారు. నడవడానికి వెనక రెండు కాళ్లుంటాయి. ముందు రెండు చిన్న కాళ్లతో ఉంటాయి. ఒవిరాప్టర్ జాతికి చెందిన ఈ డైనోలు పక్షి రూపంలో భలే వింతగా ఉండేవి. రెక్కలున్నా వీటికి ఎగిరే శక్తి మాత్రం ఉండేది కాదు.
* టర్కీ పక్షంత పరిమాణంలో ఉండే ఇవి ఎప్పుడో ఏడున్నరకోట్ల ఏళ్ల క్రితం చట్టాపట్టాలేసుకుని తిరగాడినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ రెండింటికీ తోక, ముందర కాళ్ల దగ్గర నెమలి లాంటి అందమైన ఈకలు చూడముచ్చటగా ఉండేవట.
* ఈ డైనోల శిలాజాల ఆకారాలనుబట్టి కంప్యూటర్లలో వీటి రూపాన్ని గీశారు. అందుకు పేద్ద తతంగమే జరిగింది.
* మగ జీవి, ఈకలతో ఉన్న దాని పొడవైన తోకను అటూ ఇటూ వూపుతూ ఆడ జీవిని ఆకర్షించేదిట.

No comments:
Post a Comment